...
...
Next Story

తెలంగాణ వెదర్ అప్డేట్స్ - క్రమంగా తగ్గనున్న చలి తీవ్రత...!

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది.గడిచిన 3 వారాలుగా తీవ్రమైన చలిగాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ వారంలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

Published on: Dec 31, 2025, 09:43:31 IST
Advertisement

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి గాలుల తీవ్రతకు జనజీవనం అల్లాడిపోతున్నారు. ఉదయం, రాత్రి సమయాలాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయి సింగిల్ డిజిట్‌కే పరిమితవుతున్న పరిస్థితులున్నాయి.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…

తెలంగాణలో చలి తీవ్రత
తెలంగాణలో చలి తీవ్రత

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం… ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలి గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఐఎండీ అంచనాల ప్రకారం…. ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి ప్రబలంగా ఉన్న తక్కువ స్థాయి గాలులు రాష్ట్రవ్యాప్తంగా శీతలగాలుల పరిస్థితులకు దోహదం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉండే సూచనలున్నాయి.

హైదరాబాద్ సిటీలో కూడా చలి తీవ్రత ఊహించని స్థాయిలో ఉంటోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. హెచ్ సీయూ, గచ్చిబౌలి, మౌలాలి వంటి ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

ఐఎండీ శాస్త్రవేత్త ధర్మరాజు మాట్లాడుతూ… ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శీతలగాలులు వీస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ నగర శివార్లల్లో కూడా శీతలగాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. ఉ్మమడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు.

చలి తగ్గే ఛాన్స్…!

మరోవైపు రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు ఒకట్రెండు ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గడిచిన 3 వారాలుగా ఉన్న పరిస్థితులతో పోల్చితే… క్రమంగా చలి తీవ్రత తగ్గుతోందని పేర్కొంది. ఇక సంక్రాంతి తర్వాత… వాతావరణంలో మరిన్ని మార్పులుంటాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks