...
...
Next Story

మరో 3 రోజులు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు - మరింత చలి పెరిగే అవకాశం..!

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్నిచోట్ల ఉదయం, రాత్రి సమయంలో మంచు కురుస్తోంది. మరో 3 రోజుల పాటు శీతల గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Published on: Dec 20, 2025 03:21 PM IST
Advertisement

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయంతో పాటు సాయంత్రం దాటితే చాలు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఇదే మాదిరి పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

చలి తీవ్రత
చలి తీవ్రత

రాబోయే 3 రోజులు తెలంగాణలోని పలుచోట్ల శీతల గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడకక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.

  • ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీయవచ్చు. ఈజిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
  • రేపు(డిసెంబర్ 21) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, జనగాం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల శీతల గాలులు వీచే సూచనలున్నాయి. ఈజిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
  • డిసెంబర్ 22వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

డిసెంబర్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక హైదరాబాద్ లోని వాతావరణం చూస్తే….. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో గంటకు 4-6 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఇవాళ హైదరాబాద్ లో ఉదయం నమోదైన ఉష్ణోగ్రతలు:

  • హెచ్ సీయూ: 6.3°C
  • రాజేంద్రనగర్: 7.4°C
  • మౌలాలి: 7.5°C
  • గచ్చిబౌలి: 8.4°C
  • శివరాంపల్లి: 8.4°C
  • బొల్లారం: 9.4°C
  • మారేడ్ పల్లి: 10.0°C
  • కుత్భుల్లాపూర్: 10.1°C
  • షేక్ పేట: 10.8°C
  • సులేమాన్ నగర్: 10.9°C
  • జీడిమెట్ల: 11.0°C
  • బేగంపేట: 11.5°C

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe