Telangana Weather : తెలంగాణలో భిన్న వాతావరణం... హైదరాబాద్ తో పాటు ఈ జిల్లాల్లో వర్షాలు - వాతావరణశాఖ

Telangana weather Updates : తెలంగాణలో రాబోయే ఐదు రోజుల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు వీస్తుండగా, మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Published on: Apr 27, 2026, 17:10:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గడిచిన కొద్దిరోజులుగ తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. ఓవైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. మరికొన్నిచోట్ల ఈదురుగాలులు వీస్తుండగా… ఉరుములు, మెరుపులుతో కూడిన వానలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

తెలంగాణలో భిన్న వాతావరణం (image istock)
తెలంగాణలో భిన్న వాతావరణం (image istock)

ఏప్రిల్ 27, 2026న హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం…. రాష్ట్రంలో రాబోయే నాలుగైదు రోజుల పాటు తీవ్రమైన ఎండలుంటాయి. అంతేకాకుండా అకాల వర్షాలు పడే అవకాశం ఉంది. అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. ఉరుములతో కూడిన గాలులు వీస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇవాళ సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షం పడొచ్చు. ఉపరితల గాలులు దక్షిణం లేదా నైరుతి నుంచి వీచే అవకాశం ఉంది.

  • ఏప్రిల్ 28వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇదే సమయంలో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
  • ఏప్రిల్ 29వ తేదీన నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హన్మకొండ, మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మే 3వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More