...
...
Next Story

Telangana Rain Alert : తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఉరుములు, ఈదురు గాలులతో వానలు.. ఏయే జిల్లాలంటే?

Telangana Rain Alert : తెలంగాణలో రాబోయే ఐదు రోజులు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

Published on: Aug 3, 2026, 13:32:24 IST
Advertisement

రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణం మారనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు ఈదురు గాలులు వీచే అవకాశముంది.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు…

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

ఆగస్టు 3 మధ్యాహ్నం 1:00 గంటల నుంచి ఆగస్టు 4 ఉదయం 8:30 గంటల వరకు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

  • ఆగస్టు 3 నుంచి 4 : పైన పేర్కొన్న జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా బలమైన ఉపరితల గాలులు వీచే సూచనలు ఉన్నాయి.
  • ఆగస్టు 4 నుంచి 5 : రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయి.
  • ఆగస్టు 5 నుంచి 6 : తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అన్ని జిల్లాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
  • ఆగస్టు 6 నుంచి 7 : రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. బలమైన గాలులు కొనసాగుతాయి.
  • ఆగస్టు 7 నుంచి 8 : తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe