...
...
Next Story

బలపడుతున్న అల్పపీడనం - ఏపీ తీరం వైపు పయనం..! నవంబర్ 4 వరకు తెలంగాణలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ సముద్రంలో అల్పపీడనం బలపడుతుండటంతో రాగల కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.

Published on: Oct 30, 2026, 15:39:30 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

అల్పపీడనం బలపడే అవకాశం….

అల్పపీడనం ఎఫెక్ట్ - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
అల్పపీడనం ఎఫెక్ట్ - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ - నికోబార్ దీవులు మరియు అండమాన్ సముద్ర ఆనుకోని ప్రాంతాలలో అల్పపీడనంగా మరింత బలపడే అవకాశం ఉంది.

ఆ తర్వాత రాబోయే రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంలపై దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయి.

ఏపీలో వర్షాలు…

కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉండటంతో పాటు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. రాయలసీమ ప్రాంతంలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి కేంద్రం పేర్కొంది.

తెలంగాణకు భారీ వర్ష సూచన…

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు చూస్తే…. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిమీ వేగంతో గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నవంబర్ 2 నుంచి 3 వరకు చూస్తే…. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40-50 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నవంబర్ 3 నుంచి 4 వరకు… నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks