...
...
Next Story

తెలంగాణకు రెయిన్ అలర్ట్ - 3 రోజులపాటు వర్షాలు, ఐఎండీ అంచనాలివే

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో ఈ వానలు ఉంటాయని వాతావరణశాఖ పేర్కొంది.

Published on: Nov 20, 2025, 21:23:55 IST
Advertisement

తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వర్షాలు ఉంటాయని పేర్కొంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది.

ఈనెల 23 నుంచి వర్షాలు…

ఐఎండీ రెయిన్ అలర్ట్
ఐఎండీ రెయిన్ అలర్ట్

నవంబర్ 21,22 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుంది. చలి తీవ్రత కూడా కొనసాగుతుందని అంచనా వేసింది. 23వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడుతాయని పేర్కొంది. ఈనెల 25వ తేదీ వరకు వానలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 26వ తేదీ నుంచి తిరిగి పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

హైదరాబాద్ లో చూస్తే రాత్రి వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉందని వివరించింది. ఉపరితల ాలుల ఈశాన్య దిశలో గంటకు 04-06 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంటుంది.

ఏపీ వెదర్ రిపోర్ట్…

ఇక ఏపీలో చూస్తే శుక్రవారం (21-11-25) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎల్లుండి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks