...
...
Next Story

Exam Dates : తెలంగాణలో పలు పోటీ పరీక్షల ముఖ్యమైన తేదీలు.. డేట్స్ దగ్గరపడుతున్నాయ్!

Telangana Exam Dates : తెలంగాణలో పలు పోటీ పరీక్షల తేదీలు దగ్గర పడుతున్నాయి. అంతకుముందు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఏయే పరీక్షలు ఏ తేదీల్లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Apr 2, 2026, 11:46:00 IST
Advertisement

తెలంగాణలో విద్యార్థుల కోసం 2026 ప్రవేశ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మీరు మీ క్యాలెండర్‌పై ఈ తేదీలను మార్క్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్‌ ప్లాన్ చేసుకోవాలి. టీజీ ఈఏపీ సెట్, టీజీ లాసెట్ లాంటి పరీక్షలు త్వరలో జరగనున్నాయి. వీటికి సంబంధించి అప్లికేషన్ తేదీలు కూడా దగ్గర పడుతున్నాయి.

  • టీజీ ఈఏపీసెట్(ఎంపీసీ)-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 4-పరీక్ష తేదీ 2026 మే 9, 10, 11
  • టీజీ ఈఏపీసెట్(బైపీసీ)-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 4-పరీక్ష తేదీ 2026 మే 4, 5
  • టీజీ ఎడ్‌సెట్-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 15-పరీక్ష తేదీ 2026 మే 15
  • టీజీ ఈసెట్-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 18-పరీక్ష తేదీ 2026 మే 15
  • టీజీ లాసెట్(3ఏళ్లు)-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 10-పరీక్ష తేదీ 2026 మే 18
  • టీజీ లాసెట్(5ఏళ్లు)-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 10-పరీక్ష తేదీ 2026 మే 18
  • టీజీ పీఈసెట్-దరఖాస్తు చివరితేదీ మే 5-పరీక్ష తేదీ 2026 మే 18
  • టీజీ పాలిసెట్-దరఖాస్తు చివరితేదీ ఏప్రిల్ 20-పరీక్ష తేదీ 2026 మే 13
  • టీజీ పీజీఈసెట్-దరఖాస్తు చివరితేదీ మే 6-పరీక్ష తేదీ 2026 మే 28

టీజీ లాసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణలో పోటీ పరీక్షలు
తెలంగాణలో పోటీ పరీక్షలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం టీజీ లాసెట్ 2026 దరఖాస్తు గడువును, ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించింది. టీజీ లాసెట్ దరఖాస్తు పత్రాన్ని ఇంకా పూరించని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ lawcet.tgche.ac.in ను సందర్శించవచ్చు. విద్యార్థులు LAWCET 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను గడువు తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులు తిరస్కరిస్తారు.

తెలంగాణలోని సంబంధిత కళాశాలల్లో 3-సంవత్సరాల, 5-సంవత్సరాల LLB కోర్సులలో ప్రవేశాల కోసం అధికారులు TS LAWCET 2026 పరీక్షను నిర్వహిస్తున్నారు. దరఖాస్తు పత్రాన్ని పూరించాలనుకునే విద్యార్థులు ముందుగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఆ తర్వాత తమ వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలను ఉపయోగించి దరఖాస్తు పత్రాన్ని పూరించాలి.

ఎలా అప్లై చేయాలి?

TS LAWCET దరఖాస్తు పత్రాన్ని పూరించడానికి విద్యార్థులు ఈ క్రింది దశలను పాటించాలి:

  • lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • “Apply Online for TS LAWCET 2026” పై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
  • పేరు, విద్యార్హతలు, ఇతర వివరాల వంటి సమాచారాన్ని పూరించండి.
  • ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.
  • తర్వాత అప్లికేషన్ పూర్తి చేయండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe