వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై ముఖ్యమైన అప్డేట్.. అన్ని కుదిరితే వచ్చే జూన్‌లోనే..!
వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఎయిర్‌పోర్టు డీపీఆర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. అన్ని పూర్తైతే వచ్చే జూన్‌లో పనులకు శంకుస్థాపన జరగనుంది.
వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కేంద్రం ఖరారు చేసింది. డీపీఆర్ తుది దశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 953 ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. జూన్ 2026లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో 2,500 మీటర్ల రన్‌వే నిర్మాణం ఉంటుంది. ఈ ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తర తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీ, పైలట్ శిక్షణ కేంద్రంగా మారుతుంది.

వరంగల్ మామునూరు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో విమానాశ్రయ ప్రాజెక్టుల అమలును మంత్రులు సమీక్షించారు. గడువుకు అనుగుణంగా పెండింగ్‌లో ఉన్న పరిపాలనా, సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ ప్రాజెక్ట్ డిజైన్, డీపీఆర్ తుది ఆమోదాల కోసం వేచి ఉంది. విమానాశ్రయంలో పౌర, ప్రత్యేక కార్యకలాపాలను ప్రారంభించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య ఉమ్మడి వినియోగ ఒప్పందం ఖరారు అవుతోంది.
శిక్షణ పొందిన పైలట్ల కొరతను తీర్చడానికి కూడా ఈ ఎయిర్‌పోర్ట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం శిక్షణ కార్యకలాపాలు హైదరాబాద్‌లోని శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, దుండిగల్ వైమానిక స్థావరంలో జరుగుతున్నాయి. వాణిజ్య ట్రాఫిక్ పెరగడం, ప్రైవేట్ విమానయానంలో పెరుగుదల ఫలితంగా శిక్షణార్థులకు పరిమిత విమాన ప్రయాణాలు ఉంటున్నాయి.
శిక్షణ పొందిన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులను పొందడంలో జాప్యాలను ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న స్లాట్లు తరచుగా తప్పనిసరి విమాన ప్రయాణ గంటలను పూర్తి చేయడానికి సరిపోవడం లేదు. ట్రాఫిక్ స్థాయిలు తక్కువగా ఉండే వరంగల్‌కు శిక్షణ కార్యకలాపాలను మార్చడం వలన షెడ్యూల్ పరిమితులు తగ్గుతాయని భావిస్తున్నారు. శిక్షమకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఏవియేషన్ సమ్మిట్‌లో సమీప భవిష్యత్తులో భారతదేశానికి దాదాపు 10,000 మంది అదనపు పైలట్లు అవసరమవుతాయని నిపుణులు సూచించారు. మామునూరులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అనుమతులు ఈ డిమాండ్‌లో కొంత భాగాన్ని తీర్చడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌కు వరంగల్ సమీపంలో ఉండటం వల్ల పైలట్ శిక్షణ ఇచ్చేవారిని తరలించేందుకు సులభతరం అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్‌తో పోలిస్తే వరంగల్‌లో కాస్ట్ ఆఫ్ లీవింగ్ తక్కువ కారణంగా విద్యార్థులకు ఖర్చులను తగ్గించవచ్చు.
తెలంగాణ విమానయాన విస్తరణ ప్రణాళికలకు కేంద్రం మద్దతుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లిలోని ప్రాజెక్టులతో పాటు మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ, కార్గో సేవలు, నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ సౌకర్యాలకు మద్దతు ఇస్తుందని అనుకుంటున్నారు. స్థానిక పరిశ్రమలకు, వ్యవసాయానికి లాజిస్టిక్స్ మద్దతును అందిస్తుందని చెబుతున్నారు. ఈ విమానాశ్రయాలు పూర్తైతే.. ఉపాధితోపాటుగా ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


