...
...
Next Story

తెలంగాణపై చలి పంజా - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, వణికిపోతున్న ఏజెన్సీ ప్రాంతాలు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. చలి తీవ్రత దాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Published on: Dec 7, 2025, 09:48:50 IST
Advertisement

ఏపీ , తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత చల్లగా మారుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఏపీ, తెలంగాణలో చలి పెరిగిపోయిన చలి తీవ్రత
ఏపీ, తెలంగాణలో చలి పెరిగిపోయిన చలి తీవ్రత

మరోవైపు రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అంచనా వేసింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఇవాళ ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా… మెదక్‌లో 11.3 డిగ్రీలు, హనుమకొండలో 13.5 డిగ్రీలు, రామగుండంలో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోవైపు ఏపీలోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇవాళ చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా… మరోవైపు దట్టమైన పొగమంచు కురుస్తోంది. మన్యం జిల్లాలోనూ ఇదే మాదిరి పరిస్థితులు ఉండటంతో… గిరిజన ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

మొన్నటి వరకు కూడా దిత్వా తుఫాన్ తాకిడి ప్రభావంతో కొన్నిచోట్ల వర్షాలు పడ్డాయి. తుఫాన్ ప్రభావం పూర్తి అయిన తర్వాత…. ఏపీ, తెలంగాణలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిది. దీనికి తోడు తీవ్రమైన మంచు అధికమైంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks