దిత్వా తుపాను ఎఫెక్ట్.. మరో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు!
దిత్వా తుపాను ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
దిత్వా తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. అయితే రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇది ప్రస్తుతం నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాలను ఆనుకుని కొనసాగుతోందన్నారు. చెన్నైలో నిరంతరాయంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, తుపాను తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు కనీసం 35 కి.మీ దూరంలో ఉంది. వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఈ వాయుగుండం చెన్నై తీరానికి దగ్గరలో ఉత్తర దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరుకి 200 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. దీని కారణంగా మూడు రోజులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, దక్షిణ, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ మాట్లాడుతూ తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇతర తీరప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నట్టుగా చెప్పారు.
మరోవైపు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో అనేక ప్రాంతాలు తీవ్ర జలదిగ్బంధాన్ని ఎదుర్కొన్నాయి. దక్షిణ చెన్నైలోని వేలచేరి, ఇతర ప్రాంతాల్లో సహాయక చర్యలకు కోసం పడవలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. శివారు ప్రాంతాలు కూడా వరదలకు ప్రభావితం అవుతున్నాయి. రామేశ్వరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తంగచిమడంలోని దాదాపు 200 నివాసాలు మునిగిపోయాయి.
IMD ప్రకారం, దిత్వా తుపాను గత ఆరు గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో నెమ్మదిగా ఉత్తరం వైపుకు కదిలింది. ఇది నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం ఆనుకుని ఉన్న ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 50 కి.మీ, పుదుచ్చేరికి ఈశాన్యంగా 130 కి.మీ, కడలూరుకు ఈశాన్యంగా 150 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 200 కి.మీ దూరంలో ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


