ఒక్క రాత్రిలోనే జీవితం మారిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలంగాణకు చెందిన అనిల్ కుమార్ బొల్లాను చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా ఏడాది క్రితం యూఏఈ లాటరీ చరిత్రలోనే అత్యంత భారీ నజరానా అయిన 100 మిలియన్ దిర్హామ్‌లను (భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 240 కోట్లు) గెలుచుకుని వార్తల్లో నిలిచారు. అబుదాబిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల అనిల్ కుమార్…… ఈ జాక్‌పాట్ తగిలిన ఏడాది తర్వాత తన జీవితం ఏ విధంగా రూపాంతరం చెందిందో ప్రతిష్టాత్మక గల్ఫ్ పత్రికలతో పంచుకున్నారు.

రూ.240 కోట్ల భారీ మొత్తం గెలుచుకున్న తర్వాత తన జీవితంలో వచ్చిన అతిపెద్ద మార్పు కుటుంబంతో గడిపే సమయం పెరగడమేనని అనిల్ తెలిపారు. "నా కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతున్నాను. లాటరీ విజయం నా జీవితాన్ని, నా లక్ష్యాలను పూర్తిగా మార్చేసింది," అని ఖలీజ్ టైమ్స్‌తో ఆయన అన్నారు.
గడిచిన 12 నెలల్లో అనిల్ కుమార్ ఆర్థికంగా ఎంతో స్వేచ్ఛను సాధించారు. కొంతవరకు భౌతికమైన విలాసాలను కూడా సొంతం చేసుకున్నారు. ఐఫోన్ 17 ఎయిర్, నాలుగు నుంచి ఐదు అత్యంత ఖరీదైన లగ్జరీ వాచీలను కొనుగోలు చేశారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే, కన్నవారి కలలను నెరవేర్చడమే తనకంటే ఎక్కువ సంతృప్తిని ఇచ్చిందని అనిల్ సంతోషంగా చెప్పారు.
తల్లికి బంగారం.. తండ్రికి వ్యవసాయ భూమి
లాటరీ డబ్బులు చేతికి రాగానే అనిల్ మొదట చేసిన పని తన తల్లి కోరికను తీర్చడం. "బాగా బంగారం కొనుక్కోవాలనేది మా అమ్మ డ్రీమ్. అందుకే ఆమె కోరుకున్న నగలు అన్నీ ఒకేసారి కొని కానుకగా ఇచ్చాను. అది చూసి అమ్మ కళ్లల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి," అని గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
తెలంగాణలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్…. కోట్లు సంపాదించినప్పటికీ వారి మూలాలను మర్చిపోలేదు. రూ.240 కోట్లు వచ్చినా, వారి కుటుంబం ఇప్పటికీ పాత ఇంట్లోనే నివసిస్తోంది. ఆ ఇల్లు తమ నాన్నగారు ఎంతో ఇష్టపడి కట్టుకున్న డ్రీమ్ హోమ్ అని, అందుకే దానిని వదిలిపెట్టలేదని స్పష్టం చేశారు. అయితే, సేంద్రీయ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) అంటే ఎంతో ప్రాణమిచ్చే తన తండ్రి కోసం అనిల్ ఒక పెద్ద వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా తనకు, తన సోదరుడికి ఇష్టమైన లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేశారు.
{{/usCountry}}తెలంగాణలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన అనిల్…. కోట్లు సంపాదించినప్పటికీ వారి మూలాలను మర్చిపోలేదు. రూ.240 కోట్లు వచ్చినా, వారి కుటుంబం ఇప్పటికీ పాత ఇంట్లోనే నివసిస్తోంది. ఆ ఇల్లు తమ నాన్నగారు ఎంతో ఇష్టపడి కట్టుకున్న డ్రీమ్ హోమ్ అని, అందుకే దానిని వదిలిపెట్టలేదని స్పష్టం చేశారు. అయితే, సేంద్రీయ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) అంటే ఎంతో ప్రాణమిచ్చే తన తండ్రి కోసం అనిల్ ఒక పెద్ద వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా తనకు, తన సోదరుడికి ఇష్టమైన లగ్జరీ కార్లను కూడా కొనుగోలు చేశారు.
{{/usCountry}}"నా సంతోషం ఎప్పుడూ నా కుటుంబంతోనే ముడిపడి ఉంటుంది. నా కోసం నేను ఏం చేసుకున్నా దక్కని ఆనందం.. నా తల్లిదండ్రులు, కుటుంబం కోసం చేసినప్పుడు లభిస్తుంది," అని అనిల్ పేర్కొన్నారు.
లాటరీ గెలిచిన కొత్తలో విదేశీ పర్యటనలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని, కానీ కాలక్రమేణా ఆ ఆసక్తి తగ్గిందని అనిల్ తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో ఆయన తన కుటుంబంతో కలిసి బాలి, థాయిలాండ్, ఆమ్స్టర్డామ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు.
"ప్రారంభంలో ఉన్నంత ఎగ్జైట్మెంట్ ఇప్పుడు లేదు. కానీ నాకు లభించిన ఈ అవకాశాలకు, నేను చేస్తున్న పనులకు దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతుడనై ఉంటాను" అని ఆయన పేర్కొన్నారు.
సరదాలు, విహారయాత్రలు పూర్తయ్యాక…. ఇప్పుడు సుదీర్ఘకాల ఆర్థిక భద్రత, వ్యాపార అవకాశాలపై అనిల్ దృష్టి సారించారు. ఇందులో భాగంగానే అబుదాబి ఎయిర్పోర్ట్ సమీపంలో, అలాగే దుబాయ్ మెరీనా వంటి కీలక ప్రాంతాల్లో విలువైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలను కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టారు. భారతదేశంలోనూ కొన్ని ఆస్తులను కొనుగోలు చేశారు.
అనిల్ ఇచ్చే సలహా ఏంటి…?
తనలాగే లాటరీలు గెలుచుకునే కొత్త విజేతలకు ఒక కీలకమైన సూచన చేశారు అనిల్ కుమార్. "మిలియనీర్ల క్లబ్‌లోకి మీకు స్వాగతం. ఎంత డబ్బు వచ్చినా హంబల్గా ఉండండి. మీ వద్ద ఉన్న డబ్బును సరైన ప్రణాళికతో నిర్వహించండి. క్రమశిక్షణతో, తెలివిగా మాత్రమే ఖర్చు చేయండి" అని అనిల్ హితవు పలికారు.