IRCTC Andaman Tour : ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ టూర్ ప్యాకేజీ.. ఈ నెలలోనే

IRCTC Andaman Tour : హైదరాబాద్‌ నుంచి అండమాన్‌కు టూర్ వెళ్లాలి అనుకుంటున్నారా? మీ కోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. అద్భుతమైన ప్రదేశాలు చూసి రావొచ్చు.

Published on: Sep 1, 2026, 13:49:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐఆర్‌సీటీసీ మిడిల్ క్లాస్ బడ్జెట్‌‌లో చాలా ప్రదేశాలు చూసేందుకు అవకాశం కల్పిస్తోంది. చాలామంది అండమాన్‌ దీవులకు వెళ్లాలి అనుకుంటారు. కానీ ఒక్కరిగా వెళ్లడం కష్టం అనిపిస్తుంది. అలాంటివారు ఐఆర్‌సీటీసీలోని ప్యాకేజీలను ఉపయోగించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ AMAZING ANDAMAN WITH BARATANG EX HYDERABAD టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆరు రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. సెప్టెంబర్ 26వ తేదీన ప్రారంభం అవుతుంది. పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్, బరాటాంగ్ లాంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం ద్వారా టూర్ ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్ ప్యాకేజీ (www.andamanislands.com)
ఐఆర్‌సీటీసీ అండమాన్ టూర్ ప్యాకేజీ (www.andamanislands.com)

ఏ రోజు ఎలా?

డే 1 హైదరాబాద్‌లో విమానం ఎక్కే సమయానికి 2 గంటల ముందే విమానాశ్రయం రావాలి. విమానం ఎక్కి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత హోటల్‌కు వెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ చేసి మధ్యాహ్న భోజనం తర్వాత శ్రీ విజయపురం(పోర్ట్ బ్లెయిర్)లోని ఫ్లాగ్ పాయింట్‌ను సందర్శించి, సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షోతో కూడిన సెల్యులార్ జైలు మ్యూజియానికి వెళ్తారు. రాత్రి భోజనం చేసి పోర్ట్ బ్లెయిర్‌లోనే స్టే చేస్తారు.

డే 2 పోర్ట్ బ్లెయిర్‌లో చెక్ అవుట్ చేసి క్రూయిజ్ సమయాల ప్రకారం ప్యాక్ చేసిన అల్పాహారంతో హేవ్‌లాక్‌కు బయలుదేరుతారు. హేవ్‌లాక్‌కు చేరుకున్నాక హోటల్‌లో చెక్-ఇన్, మధ్యాహ్న భోజనం తర్వాత రాధానగర్ బీచ్‌ను సందర్శిస్తారు. రాత్రి భోజనం చేసిన హోటల్‌లో చేస్తారు.

డే 3 హోటల్‌లో అల్పాహారం చేసి వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపం కోసం ఎలిఫెంట్ బీచ్‌కు వెళ్తారు. రాత్రి బస కోసం హోటల్‌కు తిరిగి వస్తారు. హోటల్‌లో రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

డే 4 అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కాలా పత్తర్ బీచ్‌కు వెళ్తారు. ఆ తర్వాత క్రూయిజ్ సమయం ప్రకారం నీల్ ద్వీపానికి తీసుకెళ్తారు. అక్కడకు చేరుకున్నాక హోటల్‌లో చెక్ ఇన్ చేయండి. సాయంత్రం సూర్యాస్తమయం కోసం సీతాపూర్ బీచ్ అండ్ లక్ష్మణ్‌పూర్ బీచ్‌లను సందర్శించండి. హోటల్‌లో రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

డే 5 అల్పాహారం తర్వాత చెక్ అవుట్ చేసి, భరత్‌నగర్ బీచ్‌ను సందర్శిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుంటారు. సాయంత్రం విశ్రాంతి తీసుకుని.. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం చేస్తారు. అక్కడే స్టే.

డే 6 అల్పాహారం చేసి.. ఆ తర్వాత బరాటాంగ్ పర్యటనకు వెళ్తారు. రాత్రి బస పోర్ట్ బ్లెయిర్‌లోనే ఉంటుంది.

డే 7 హోటల్‌లో అల్పాహారం చేసి ఉదయాన్నే హోటల్ నుండి చెక్-అవుట్ చేస్తారు. ఉదయం 07:55 గంటలకు విమానాశ్రయంలో దింపుతారు. ఉదయం 09:55 గంటలకు విమానం ఎక్కుతారు. దీంతో అండమాన్ పర్యటన ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు

సింగిల్ ఆక్యుపెన్సీ రూ.87,700, డబుల్ ఆక్యుపెన్సీ రూ.67, 300, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.65, 200, చైల్డ్ విత్ బెడ్ రూ.57,450, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.53, 350గా ఉంది.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com వెళ్లండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More