...
...
Next Story

అండమాన్ యాత్రకు వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు

ఈ నవంబర్‌లో అండమాన్ టూర్ వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. బడ్జెట్ ధరలో మంచి మంచి ప్రదేశాలు చుట్టేసిరావొచ్చు.

Published on: Nov 2, 2025, 17:54:55 IST
Advertisement

అండమాన్ వెళ్లి చూసి రావాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీ నడుపుతోంది. AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18) పేరుతో అందుబాటులో ఉంది. ఆరు రోజులు, 5 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తీసుకెళ్తారు. ఐఆర్‌సీటీసీ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 21వ తేదీన టూర్ అందుబాటులో ఉంది.

ఆరో రోజుల ప్లాన్ ఇలా

అండమాన్ టూర్ ప్యాకేజీ
అండమాన్ టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం 6.25 గంటలకు ఫ్లైట్ బయలుదేరి శ్రీ విజయపురం(పోర్ట్ బ్లెయిర్) 08:55 గంటలకు చేరుకుంటుంది. ఇందుకోసం మీరు ఉదయం 4.35 వరకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోవడం మంచిది. పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నాక.. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. భోజనం తర్వాత సెల్యులార్ జైలు మ్యూజియం, తరువాత కార్బిన్స్ కోవ్ బీచ్‌ను సందర్శిస్తారు. ఆపై సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షోకు వెళ్తారు.

రెండో రోజు చెక్ అవుట్ చేసి, క్రూయిజ్ టైమింగ్స్ హేవ్‌లాక్‌కు వెళ్తారు. హేవ్‌లాక్ చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ చేసి, భోజనం తర్వాత రాధానగర్ బీచ్‌ను సందర్శిస్తారు. హోటల్‌లో డిన్నర్ చేస్తారు.

మూడో రోజు హోటల్‌లో అల్పాహారం చేసి.. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఎలిఫెంట్ బీచ్‌కు వెళ్తారు. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీలకు మీరే చెల్లించాలి. రాత్రి బస కోసం హోటల్‌కు తిరిగి వెళ్లి.. డిన్నర్ చేస్తారు.

నాలుగో రోజు అల్పాహారం తర్వాత చెక్ అవుట్ చేసి కాలా పత్తర్ బీచ్‌కు వెళ్లాలి. ఆ తర్వాత నీల్ ఐలాండ్‌కు తీసుకెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేయండి. సాయంత్రం సూర్యాస్తమయం కోసం సీతాపూర్ బీచ్ అండ్ లక్ష్మణ్‌పూర్ బీచ్‌లను సందర్శిస్తారు. హోటల్‌లోనే డిన్నర్ చేస్తారు.

ఆరో రోజు హోటల్‌లో అల్పాహారం చేసి.. ఉదయం హోటల్ నుండి చెక్-అవుట్ అయి 07:55 గంటలకు విమానాశ్రయం వెళ్తారు. ఉదయం 09:55 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో అండమాన్ టూర్ ముగుస్తుంది.

ధరలు ఇవి

సింగిల్ ఆక్యూపెన్సీ కోసం రూ.74425, డబుల్ ఆక్యూపెన్సీకి రూ.56625, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.54925, చైల్డ్ విత్ బెడ్ రూ. 48785, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.45485గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం మీరు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com వెళ్లండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe