హైదరాబాద్ టు అరకు - ఈ IRCTC టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. వైజాగ్, అరకు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. నవంబర్ 27వ తేదీన జర్నీ ఉంటుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Nov 22, 2025, 13:06:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైజాగ్, అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? అయితే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం నుంచి ప్యాకేజీ వచ్చేసింది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 27వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - అరకు టూర్ ప్యాకేజీ

టూర్ షెడ్యూల్ వివరాలు:

  • హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5.05 గంటల ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఉదయం 5.55 గంటలకు విశాఖకు చేరుకుంటారు. హోటల్ కు చెకిన్ అవుతారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. ఖాళీమాతా ఆలయాన్ని దర్శించుకుంటారు. సబ్ మెరైన్ మ్యూజియంను చూస్తారు. భోజనం తర్వాత… కైలాసగరి హిల్స్, రుషికొండ బీచ్ కు వెళ్తారు. రాత్రి విశాఖలోనే బస చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. అరకుకు వెళ్తారు. తైదా జంగల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియంను సందర్శిస్తారు. గాలికొండ వ్యూ పాయింట్,బొర్రా కేవ్స్ ను చూస్తారు. రాత్రి తిరిగి విశాఖకు చేరుకుంటారు.
  • బ్రేక్ ఫాస్ట్ తర్వాత సింహాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆర్కే బీచ్ వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు విశాఖ నుంచి తిరిగి ప్రయాణమవుతారు.
  • చివరి రోజు ఉదయం 06:15 గంటలకు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేర్ కు రూ. 27910, ట్విన్ షేరి్ంగ్ కు రూ. 17010, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13370గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 26010, డబుల్ షేరింగ్ కు రూ. 15110, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11480గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 మొబైల్ నెంబర్లను సంప్రదింవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More