హైదరాబాద్ టు తమిళనాడు టూర్ ప్యాకేజీ - లిస్టులో అరుణాచలం, పాండిచ్చేరి..! ఈనెలలోనే ట్రిప్
హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. 5 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.
దైవదర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు IRCTC టూరిజం సరికొత్త ఆధ్యాత్మిక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది "అరుణాచల మోక్ష యాత్ర" (Arunachala Moksha Yatra) పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఈ ప్యాకేజీ ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరుణాచలం (తిరువణ్ణామలై), కాంచీపురంలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు. హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి శుక్రవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం జూన్ 12వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

టూర్ షెడ్యూల్ :
- మొదటి రోజు (శుక్రవారం) : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 17:00 గంటలకు రైలు నంబర్ 17653 (కాచిగూడ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
- రెండవ రోజు (శనివారం) : ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన వాహనంలో హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆరోవిల్, అరబిందో ఆశ్రమం, పారడైజ్ బీచ్‌లను సందర్శిస్తారు. రాత్రికి పుదుచ్చేరిలోనే బస చేస్తారు.
- మూడవ రోజు (ఆదివారం) : హోటల్‌లో ఉదయం అల్పాహారం చేసిన తర్వాత 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువణ్ణామలై (అరుణాచలం) బయలుదేరుతారు. అక్కడ హోటల్‌లో చెక్-ఇన్ అయిన తర్వాత భక్తులు తమకు వీలైన సమయంలో అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు . రాత్రికి తిరువణ్ణామలైలోనే బస ఉంటుంది.
- నాల్గవ రోజు (సోమవారం) : హోటల్‌లో అల్పాహారం ముగించుకుని రూమ్ ఖాళీ చేసి, 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం బయలుదేరుతారు. అక్కడ ప్రసిద్ధ కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కోణం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.అక్కడ రాత్రి 18:05 గంటలకు రైలు నంబర్ 17651 ఎక్కి తిరుగు ప్రయాణమవుతారు.
- ఐదవ రోజు (మంగళవారం) : ఉదయం 07:50 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగుస్తుంది.
ఈ టూర్‌లో ప్రయాణించే వారి సంఖ్యను బట్టి ధరలను నిర్ణయించారు. వాహనాలు, గదులను షేరింగ్ బేసిస్‌పై కేటాయిస్తారు. స్టాండర్డ్ క్లాస్ (స్లీపర్)లో ట్విన్ షేరింగ్ (ఇద్దరు పంచుకుంటే) రూ.14,820, ట్రిపుల్ షేరింగ్ (ముగ్గురు పంచుకుంటే) రూ.11,125గా ఉంటుంది. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో కావాలంటే రూ.7,950, బెడ్ లేకుండా రూ.5,450 గా నిర్ణయించారు. కమ్‌ఫర్ట్ క్లాస్ (3AC) అయితే ట్విన్ షేరింగ్‌కు రూ.16,900, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,210గా ఉంటుంది. పిల్లలకు బెడ్‌తో రూ.10,030, బెడ్ లేకుండా రూ.7,530 గా ఉంది.
4 నుంచి 6 గురు ప్రయాణికులు గ్రూప్‌గా ఉంటే (ఒక్కొక్కరికి చొప్పున)… స్టాండర్డ్ క్లాస్ (స్లీపర్) లో ట్విన్ షేరింగ్‌కు రూ.11,820, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.9,840గా ఉంటుంది. కమ్‌ఫర్ట్ క్లాస్ (3AC)లో అయితే ట్విన్ షేరింగ్‌కు రూ.13,900, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11,920గా నిర్ణయించారు.
మరిన్ని వివరాలు లేదా బుకింగ్ కోసం సికింద్రాబాద్ ఆక్స్‌ఫర్డ్ ప్లాజాలోని ఐఆర్‌సీటీసీ దక్షిణ మధ్య జోన్ కార్యాలయాన్ని సంప్రదించవ్చు. లేదా 8287932229, 8287932228, 9701360701 మొబైల్ నంబర్లకు కాల్ చేయవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

