న్యూఇయర్ వేళ ‘అరుణాచళేశ్వరుడి’ దర్శనం - హైదరాబాద్ నుంచి 5 రోజుల టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

ఈ కొత్త సంవత్సరం వేళ అరుణాచళేశ్వరుడిని దర్శించుకునే ప్లాన్ ఉందా..? అయితే మీకోసం హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చింది. 5 రోజుల ట్రిప్ ఉంటుంది. ఈ ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేయండి……

Published on: Dec 17, 2025, 11:23:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరికొన్నిరోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది… చాలా మంది కూడా రకరకాల ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు..! మరికొందరైతే నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ అధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే తమిళనాడులోని అరుణాచళేశ్వరుడిని దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన జర్నీ ఉంటుందని పేర్కొంది.

హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ
హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్తున్నారు. అంతేకాకుండా గిరిప్రదక్షిణ చేసే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వెళ్లాలి అనుకుంటే ఈ స్పెషల్ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగాఅరుణాచలం మాత్రమే కాదు పుదుచ్చేరి, లకాంచీపురం కూడా చూడొచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

టూర్ షెడ్యూల్ వివరాలు:

  • డే 1 : కాచిగూడ నుంచి సాయంత్రం 5 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ 17653) ఉంటుంది. రాత్రి అంతా జర్నీలో ఉంటారు.
  • డే 2 : రెండో రోజు అంటే పుదుచ్చేరికి ఉదయం 11.05 గంటలకు చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఆ తర్వాత అరోవిల్లే, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ ను చూస్తారు. రాత్రి పుదుచ్చేరిలోనే బస ఉంటుంది.
  • డే 3 :హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి అరుణాచలం బయలుదేరుతారు. అక్కడ హోటల్‌లో చెకిన్ చేసిన తర్వాత అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి తిరువన్నమలైలో బస చేస్తారు.
  • డే 4 :నాల్గో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి కాంచీపురానికి బయలుదేరుతారు. అరుణాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామాక్షి అమ్మన్ టెంపుల్, ఏకాంబరేశ్వర ఆలయం తీసుకెళ్తారు. ఆ తర్వాత అరక్కోణం స్టేషన్ వెళ్తారు. తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
  • డే 5 :ఐదో రోజు ఉదయం 07.50 గంటలకు కాచిగూడకు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ 3ఏసీలో ట్విన్ షేరింగ్ కు రూ. 19130, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14740గా నిర్ణయించారు. చైల్డ్ విత్ బెడ్ రూ.10,700, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.8060గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్విన్ షేరింగ్ కు రూ. 17060, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12670గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు, ఇతర వివరాల కోసం 8287932229 / 8287932228 / 9701360701 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More