న్యూ ఇయర్ వేళ కర్ణాటక ట్రిప్ - హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, బడ్జెట్ ధరలోనే..!

న్యూ ఇయర్ వేళ కర్ణాటకలోని పలు ప్రముఖ ప్రాంతాలను చూసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. మొత్తం 6 రోజుల టూర్ లో భాగంగా.. మురడేశ్వర్, ఉడిపి, శృంగేరితో పాటు పలు ప్రాంతాలను చూడొచ్చు.

Published on: Dec 13, 2025 12:13 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూ ఇయర్ రాబోతుంది..! మరికొన్ని రోజులు అయితే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతాం. అయితే కొత్త సంవత్సరం వేళ చాలా మంది ఏవైనా టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లాలని చూస్తుంటారు..! అయితే మీకోసం ఐఆర్సీటీసీ… బడ్జెట్ ధరలోనే కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ (images from Unsplash)
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ (images from Unsplash)

అధ్యాత్మిక ప్రాంతాలను చూపించేందుకు IRCTC టూరిజం ఈ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది. "కోస్టల్ కర్ణాటక' పేరుతో ఆపరేట్ చేయనుంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ ఉంటుంది.

ప్రస్తుతం ఈ ప్యాకేజీ 6 జనవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను IRCTC టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లో తెలుసుకోవచ్చు.

టూర్ షెడ్యూల్ వివరాలు:

  • డే 1 : కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు ట్రైన్ (మంగళూర్ సెంట్రల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెంబర్ 12789) బయల్దేరుతుంది. రాత్రి అంతా ప్రయాణం చేస్తారు.
  • డే 2 : ఉదయం 9.15 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpe బీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.
  • డే 3 : ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.
  • డే 4 :హొర్నాడు కు చేరుకుంటారు. అన్నపూర్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. తిరిగి శృంగేరికి బయల్దేరుతారు. శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంచుకుంటారు. సాయంత్రం తిరిగి మంగళూరుకు వెళ్తారు.
  • డే 5 :ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత కదిరిమంజునాత టెంపుల్ కు వెళ్తారు. సాయంత్రం Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ (Train No. 12790) అవుతుంది.
  • డే 6 : మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ధరలు :

ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ.41,630ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 23,670 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.19,000గా ఉంది. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు ఉంటాయి.

స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,970గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 38600గా ఉండగా…. డబుల్ షేరింగ్ కు రూ. 20650గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.