కేరళ అందాలను చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఈ నెలలోనే జర్నీ...!

కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా…? ఐఆర్సీటీసీ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చింది. ఈ డిసెంబర్ నెలలోనే జర్నీ ఉంటుంది. షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Dec 4, 2025, 09:19:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేరళలోని ప్రకృతి అందాలను ఒక్క మాటల్లో వర్ణించలేం. పచ్చని ప్రకృతి అందాలతో పాటు దానికితోడు బోటులో జర్నీ చేస్తూ…. మంచి మంచి ప్రదేశాలను చూడొచ్చు. ప్రస్తుత సీజన్ లోనూ చాలా మంది కేరళ ట్రిప్ కు వెళ్తుంటారు. ఆసక్తి గల టూరిస్టుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

కేరళ టూర్ ప్యాకేజీ
కేరళ టూర్ ప్యాకేజీ

ఐఆర్సీటీసీ టూరిజం 'కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 9 డిసెంబ్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవాలి.

జర్నీ షెడ్యూల్ ఇలా….

  • డే 1 : హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(ట్రైన్ నెంబర్-20629, శబరి ఎక్స్ ప్రెస్) నుంచి మధ్యాహ్నం 12:25 గంటలకు జర్నీ మొదలవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • డే 2 : ఉదయం 11.30 గంటలకు అలువా రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.
  • డే 3 : ఉదయం ఎరవీకులం నేషన్ ప్రాక్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ తో పాటు ఏకో పాయింట్ ను చూస్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు.
  • డే 4 : అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
  • డే 5 : హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.15 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
  • డే 6 : ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ కంప్లీట్ అవుతుంది.

టికెట్ ధరలు :

ఐఆర్సీటీసీ టూరిజం తెలిపిన వివరాల ప్రకారం… సింగిల్ షేరింగ్ కు రూ.33,390, డబుల్ షేరింగ్ కు రూ.19,440 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 16,820గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్(3A) లో ఉంటాయి.

స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,040గా ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 30,610, డబుల్ షేరింగ్ కు రూ. 16,670గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More