హైదరాబాద్ టు కేరళ - ఈ 6 రోజుల టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

కేరళ ట్రిప్ ప్లాన్ ఉందా..? మీకోసం ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ నవంబర్ నెలలోనే జర్నీ ఉంటుంది. షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Nov 07, 2025 2:25 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేరళలోని ప్రకృతి అందాలను ఒక్క మాటల్లో వర్ణించలేం. పచ్చని ప్రకృతి అందాలతో పాటు దానికితోడు బోటులో జర్నీ చేస్తూ…. మంచి మంచి ప్రదేశాలను చూడొచ్చు. అయితే ఇలాంటి అవకాశాన్ని బడ్జెట్ ధరలోనే ఆస్వాధించే అవకాశాన్ని ఐఆర్సీటీసీ టూరిజం తీసుకొచ్చింది. టూరిస్టుల కోసం హైదరాబాద్ నుంచి ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

కేరళ టూర్ ప్యాకేజీ
కేరళ టూర్ ప్యాకేజీ

ఐఆర్సీటీసీ టూరిజం 'కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 18 నవంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవాలి. ఈ వివరాలను https://www.irctctourism.com వెబ్ సైట్ లో చూడొచ్చు.

టూర్ షెడ్యూల్ వివరాలు:

  1. మొదటి రోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(ట్రైన్ నెంబర్-20629, శబరి ఎక్స్ ప్రెస్) నుంచి మధ్యాహ్నం 12:25 గంటలకు జర్నీ మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు.
  2. రెండో రోజు ఉదయం 11.30 గంటలకు అలువా రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.
  3. 3వ రోజు ఉదయం ఎరవీకులం నేషన్ ప్రాక్ ను చూస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ తో పాటు ఏకో పాయింట్ ను చూస్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే ఉంటారు.
  4. నాల్గో రోజు హోటల్ నుంచి బయల్దేరి…. అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
  5. ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.15 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
  6. 6వ రోజు మధ్యాహ్నం 11:00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.33,390, డబుల్ షేరింగ్ కు రూ.19,440 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 16,820గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్(3A) లో ఉంటాయి.

స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,040గా ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 30,610, డబుల్ షేరింగ్ కు రూ. 16,670గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.