'కర్ణాటక' ట్రిప్ వెళ్తారా..? హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

కర్ణాటక తీర ప్రాంతంలోని పలు ప్రాంతాలను చూసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను ఆపరేట్ చేయనుంది. మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి వంటి ఆలయాలను చూస్తారు. ముఖ్యమైన వివరాలను ఇక్కడ చూడండి…

Published on: Nov 06, 2025 5:09 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్ణాటక ట్రిప్ ప్లాన్ ఉందా…? అయితే బడ్జెట్ ధరలోనే ఎక్కువ అధ్యాత్మిక ప్రాంతాలను చూపించేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది. "Coastal Karnataka' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది.

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ (images from Unsplash)
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ (images from Unsplash)

హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ 11 నవంబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ వివరాలను IRCTC టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లో తెలుసుకోవచ్చు.

టూర్ షెడ్యూల్ వివరాలు:

  • మొదటి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 గంటలకు ట్రైన్ (మంగళూర్ సెంట్రల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెంబర్ 12789) బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 9.15 గంటలకు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpe బీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు.
  • 3వ రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.
  • 4వ రోజు Hornadu(హొర్నాడు) కు చేరుకుంటారు. అన్నపూర్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.
  • ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.

హైదరాబాద్ - కర్ణాటక టూర్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.41,630ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 23,670 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.19,000గా ఉంది. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు ఉంటాయి.

స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,970గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 38600గా ఉండగా…. డబుల్ షేరింగ్ కు రూ. 20650గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.