ఈ మంచు కురిసే వేళల్లో పాపికొండలు ట్రిప్ - హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి
హైదరాబాద్ నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీ వచ్చేసింది. తెలంగాణ టూరిజం ఆపరేట్ చేయనుంది. ఈ డిసెంబర్ నెలలోనే జర్నీ ఉంటుంది. ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ మంచు కురిసే వేళలో పాపికొండల అందాలను చూడాలనుకుంటున్నారా..? గోదావరి అలలపై వివాహరిస్తూ సాగే అద్భుతమైన జర్నీని అస్వాదించాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ డిసెంబర్ నెలలోనే జర్నీ తేదీలున్నాయి.

భద్రాచలం - పాపికొండలు నాన్ ఏసీ ప్యాకేజీ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ నెలలో చూస్తే... 12, 19, 26 తేదీల్లో ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
టూర్ షెడ్యూల్ ఇలా:
- డే 1: సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్ ఐఆర్ఓ-పర్యాటక్ భవన్ నుంచి బస్సు (నాన్ ఏసీ)బయలుదేరుతుంది. రాత్రి 8 గంటలకు బషీర్‌బాగ్ చేరుకుటుంది. రాత్రి మొత్తం ప్రయాణం సాగుతుంది.
- డే 2: ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. ఉదయం 8:00 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి లాంచీలో గోదావరిపైన పాపికొండలు టూర్ మొదలవుతుంది.పేరంటాలపల్లి, కొల్లూరు, కోర్టూరు ప్రాంతాల మీదుగా జర్నీ సాగుతుంది. స్నాక్స్, భోజనం ఇస్తారు. సాయంత్రానికి తిరిగి భద్రాచలం చేరుకుంటారు. అక్కడి హరిత హోటల్లో రాత్రి బస చేస్తారు.
- డే 3: ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత భద్రాచలం రాములోరి ఆలయాన్ని రామాలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత పర్ణశాలను సందర్శిస్తారు. తిరిగి భద్రాచలం హరిత హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం తర్వాత భద్రాచలం నుండి హైదరాబాద్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ధరల వివరాలు:
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... పెద్దలకు రూ.6,999, పిల్లలకు రూ.5,599గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం https://tgtdc.in/ వెబ్ సైట్ చూడొచ్చు. 180042546464 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా సంప్రదించి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

