అధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీ కోసం బడ్జెట్ ధరలోనే మంచి టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీ టూరిజం. ఒకే ప్యాకేజీలో పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేలా ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి ''స్పిరిచువల్ తెలంగాణ విత్ శ్రీశైలం" పేరుతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.
చూస్తే ప్రాంతాలు - టూర్ షెడ్యూల్ వివరాలు:

ఈ కొత్త టూర్ ప్యాకేజీలో భాగంగా శ్రీశైలం చూడొచ్చు. అంతేకాకుండా హైదరాబాద్ సిటీలోని చార్మినార్, సలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్, గోల్కోండ ఫోర్టును సందర్శిస్తారు. ఫైనల్ గా యాదాద్రి నర్సింహ్మా స్వామిని దర్శించుకోవటంతో టూర్ ముగుస్తుంది. చివరగా యాదాద్రి కూడా వెళ్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 25 నవంబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది.ఈ తేదీ మిస్ అయిత్ మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తం 4 రోజుల ప్యాకేజీ ఇది.
- మొదటి రోజు హైదరాబాద్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. చార్మినార్, సలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ ను చూస్తారు. ఆ తర్వాత హోటల్ కు వెళ్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.
- 2వ రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు. తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
- మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. బిర్లా మందిర్ వెళ్తారు. ఆ తర్వాత గొల్కోండ ఖిల్లాను చూస్తారు. మధ్యాహ్నం అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు.
- టూర్ ప్యాకేజీలో చివరి రోజు భాగంగా ఉదయం యాదాద్రికి వెళ్తారు. సురేంద్రపురిని కూడా సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీ ధరలను చూస్తే…. డబుల్ షేరింగ్ కు రూ. 19,890, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,010గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఈ టూరిజం ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే… https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భోజన వసతితో పాటు మరికొన్ని సదుపాయాలు ఉంటాయి. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
{{/usCountry}}ఈ ప్యాకేజీ ధరలను చూస్తే…. డబుల్ షేరింగ్ కు రూ. 19,890, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,010గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఈ టూరిజం ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే… https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భోజన వసతితో పాటు మరికొన్ని సదుపాయాలు ఉంటాయి. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
{{/usCountry}}