...
...
Next Story

హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. పిస్తా హౌస్, షాగౌస్‌ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు

హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ మరోసారి దాడులు నిర్వహిస్తున్నది. ప్రముఖ హోటళ్లు అయిన పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు అధికారులు.

Published on: Nov 18, 2025, 09:20:03 IST
Advertisement

పిస్తా హౌస్‌, షాగౌస్‌ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పిస్తా హౌస్ షాగౌస్ హోటల్లో యజమానుల ఇళ్లలో ఉదయమే తనిఖీలు మెుదలుపెట్టింది ఆదాయపు పన్ను శాఖ. పిస్తా హౌస్, షాగౌస్ హోటల్స్ ప్రతి ఏటా వందల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. రికార్డుల్లో చూపిన ఆదాయం నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు.

ఐటీ దాడులు
ఐటీ దాడులు

ఈ హోటళ్ల ప్రధాన కార్యాలయంలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. వీరికి సంబంధించి హావాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించారు. మొత్తం నాలుగు టీమ్స్ ‌గా ఏర్పడి సోదాలు చేస్తున్నారు.

హోటళ్ల యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. ఏకకాలంలో 15 చోట్ల మొత్తం 50కిపైగా బృందాలతో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న అన్ని బ్రాంచీలలో కూడా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్లు ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తుంటాయి. దేశంలోని పలు నగరాలతోపాటుగా దుబాయ్‌లోనూ రెండు హోటళ్ల బ్రాంచీలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe