...
...
Next Story

'మాది నరదిష్టి అయితే ఇక్కడ నీకు ఆస్తులు ఎందుకు...? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. నరదిష్టి అంటూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Published on: Nov 29, 2025, 15:48:35 IST
Advertisement

ఏపీ డిప్యూటీ సీఎం మీద పవన్ కల్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ వాళ్ల నరదిష్టి తగిలింది అని మాట్లాడినందుకు ఇక్కడి ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలది నరదిష్టి అయితే… హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను అమ్ముకొని విజయవాడ వెళ్ళిపో అంటూ సీరియస్ అయ్యారు.

ఆయన మాట్లాడింది తప్పు - అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

“తెలంగాణ వాళ్ళ నర దిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం, కానీ ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో. నిజంగా తెలంగాణ వాళ్ళకి నర దిష్టి, ఒకరు బాగు పడొద్దు అనేది ఉంటే ఆంధ్రా వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా…? ఇరిగేషన్, కన్‌స్ట్రక్షన్‌ అన్నిట్లో ఆంధ్రా వాళ్ళు ఉన్నారు అయినా ఒక్క మాట మేము అంటున్నామా…? నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే కానీ తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పే” అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ బ్రతకాలని రూ.800 టికెట్ రేట్ ఉన్నా నేను పోయి చూశా. మాది నర దిష్టి అయితే హైదరాబాద్‌లో ఎందుకు ఆస్తులు కొంటున్నావు.. ఇక్కడ అన్ని అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడు.. కాబట్టి క్షమాపణలు చెప్పాలి” అని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks