Jeevan Reddy Resign : కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా - రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు , పోరాటం ఆగదని వార్నింగ్
కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్ గా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన… రాజీనామా లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. పార్టీలో జరిగిన అవమానాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ పై ఫైర్….
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి.. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డిని తెచ్చి అతనికి ఇచ్చారని విమర్శించారు. దాని ప్రభావం మహబూబ్ నగర్ అలానే చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లుపై పడిందన్నారు.
“తనకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎంతమందిని తొక్కుతావయ్య నువ్వు…? నీ తొక్కుడు కాదు రేవంత్ రెడ్డి.. ఈ జగిత్యాలలో ఏ శక్తి నన్ను ఆపలేదు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేశాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా పోరాటం చేస్తాను ”అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
నేను కొంతమంది లాగా ముఖ్యమంత్రి అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీకి రాలేదని జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నువ్వు(రేవంత్ రెడ్డి) ముఖ్యమంత్రి అయ్యావు.. కానీ మమ్మల్ని కూడా బతకనివ్వు అంటూ కామెంట్స్ చేశారు.
"రేవంత్ రెడ్డిని ఎదిరించి పోరాటం చేస్తా. నీతో అణగదొక్కబడటం కంటే పోరాటం చేస్తే నాకు పోయేది ఏముంది. వేం నరేందర్ రెడ్డి ఎవరు…? ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంది…? పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరు..? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం..? బ్రతకడానికి వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా నియామకం అయిన తర్వాత వాడు ఇచ్చిన సలహాలు ఏమైనా ఉన్నాయా…?" అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నలు గుప్పించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

