Job Mela in Osmania University 2026 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జాబ్ మేళా జరగనుంది. యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ఆర్థిక సేవల సంస్థ ‘మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్’లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
- పోస్టు పేరు : జూనియర్ అసిస్టెంట్
- విద్యార్హత: ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
- వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ. 20,000 వరకు ప్రారంభ వేతనం అందిస్తారు.
- వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్.
- తేదీ : 30 అక్టోబర్ 2026 (శుక్రవారం)
- సమయం : ఉదయం 11:00 గంటల నుంచి వేదిక:
- ఇంటర్వూ వేదిక : ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న 'యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో' (UEI & GB), ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అప్‌డేట్ చేసిన బయోడేటా / రెజ్యూమ్‌తో పాటు విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లతో ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది. అదనపు సమాచారం లేదా ఇతర సందేహాల నివృత్తి కోసం రిజినల్ మేనేజర్ రవీంద్రకుమార్ ఫోన్ నంబర్లు 6261688998 లేదా 8247656356ను సంప్రదించవచ్చు.