Osmania University Job Mela : నిరుద్యోగులకు అలర్ట్ - ఈనెల 30న ఓయూ క్యాంపస్ లో జాబ్ మేళా

Job Mela in Osmania University 2026 :హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఈనెల 30న  జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు హాజరుకావొచ్చు.

Published on: Oct 26, 2026, 12:05:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Job Mela in Osmania University 2026 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జాబ్ మేళా జరగనుంది. యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ

ఆర్థిక సేవల సంస్థ ‘మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్’లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

  • పోస్టు పేరు : జూనియర్ అసిస్టెంట్
  • విద్యార్హత: ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
  • వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ. 20,000 వరకు ప్రారంభ వేతనం అందిస్తారు.
  • వయోపరిమితి: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్.
  • తేదీ : 30 అక్టోబర్ 2026 (శుక్రవారం)
  • సమయం : ఉదయం 11:00 గంటల నుంచి వేదిక:
  • ఇంటర్వూ వేదిక : ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న 'యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో' (UEI & GB), ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అప్‌డేట్ చేసిన బయోడేటా / రెజ్యూమ్‌తో పాటు విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లతో ప్రత్యక్షంగా హాజరుకావాల్సి ఉంటుంది. అదనపు సమాచారం లేదా ఇతర సందేహాల నివృత్తి కోసం రిజినల్ మేనేజర్ రవీంద్రకుమార్ ఫోన్ నంబర్లు 6261688998 లేదా 8247656356ను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More