...
...
Next Story

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : 42 టేబుల్స్, 10 రౌండ్లలో కౌంటింగ్ - గెలిచేదెవరు...?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 14వ తేదీన ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.10 రౌండ్లలో ఉప ఎన్నిక ఫలితాలు తేలనున్నాయి.

Published on: Nov 13, 2025 02:07 PM IST
Advertisement

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన నాటి నుంచి ఈ ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఎవరు గెలవబోతున్నారనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

10 రౌండ్లు, 42 టేబుల్స్….

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితం

నవంబర్ 14వ తేదీన యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేయగా… 10 రౌండ్లలో ఉపఎన్నిక ఫలితాలు తేలేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒకటో నెంబర్‌ పోలింత్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనుంది. ఓట్ల లెక్కింపు చేపట్టే కేంద్రాల వద్ద భారీగా భద్రత ఉండనుంది.

రహ్మత్‌నగర్‌ డివిజన్‌లోని 15 కేంద్రాల్లో, బోరబండ డివిజన్‌లోని 13, ఎర్రగడ్డలో 3, వెంగళరావునగర్‌లో ఒక చోట 60 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. ఈ ఉపఎన్నిక ఫలితాల్లో ఈ డివిజన్లలోనే ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే…48.49 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.

ఇక కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి స్పెషల్ అధికారిని ఏర్పాటు చేశారు. మొత్తం 186 మంది కౌంటింగ్ సిబ్బంది పని చేస్తారు. కౌంటింగ్‌ను ఎప్పటికప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ పరిశీలిస్తారు. అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఇతరులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ఇక పోలింగ్ సందర్భంగా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే కౌంటింగ్ రోజు ఎక్కడ కూాడా ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 144 సెక్షన్ అమలు చేయనున్నారు.

మొత్తంగా నవంబర్ 14న జరిగే ఓట్ల లెక్కింపులో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి ప్రదీప్ రెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe