జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్టిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇప్పటి వరకు సర్వేలు కాంగ్రెస్ పార్టీ వైపే మెుగ్గు చూపాయి. కాంగ్రెస్‌కు చాణక్య స్ట్రాటజీస్-46 శాతం, బీఆర్ఎస్‌కు 41 శాతం, బీజేపీకి 06 శాతం గెలుపు అవకాశం ఉందని అంచనా వేసింది.

పబ్లిక్ పల్స్ చూసుకుంటే.. కాంగ్రెస్-48 శాతం, బీఆర్ఎస్-41 శాతం, బీజేపీ-06 శాతంగా ఉంది. స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్- 48.2 శాతం, బీఆర్ఎస్-42.1 శాతం కాగా జన్‌మైన్ సర్వే కూడా హస్తం పార్టీ వైపే మెుగ్గు చూపింది. నాగన్న సర్వే వివరాలు చూస్తే.. కాంగ్రెస్‌కు 47 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 8 శాతం ఓట్లు పడ్డాయని అంచనా వేసింది. హెచ్ఎంఆర్ సర్వే ప్రకారం.. హస్తం పార్టీకి 48.3 శాతం, బీఆర్ఎస్‌కు 43.18 శాతం, బీజేపీ 5.84 శాతం వచ్చే అవకాశముంది.
బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ సతీమణి సునీత పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఎంఐఎం పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది.
జూబ్లీహిల్స్‌లో సాయంత్రం 5 వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈనెల 14న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.
మరోవైపు ఎన్నికల నియామవళి ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై మధురానగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. దాస్యం వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ పీఎస్‌లో కేసు నమోదు అయింది. పోలింగ్ బూత్‌లో బీఆర్‌ఎస్ ఏజెంట్లను బెదిరించారని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్‌పై కొప్పుల ఈశ్వర్ ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపించారని చెప్పారు.
పోలింగ్ ముగిసిన తర్వాత యూసుఫ్‌గూడ మహబూబ్ ఫంక్షన్‌హాల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన ఇరువర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. మాగంటి సునీతను మహబూబ్ ఫంక్షన్‌హాల్ నుంచి పంపించారు. పాడి కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
{{/usCountry}}పోలింగ్ ముగిసిన తర్వాత యూసుఫ్‌గూడ మహబూబ్ ఫంక్షన్‌హాల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన ఇరువర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. మాగంటి సునీతను మహబూబ్ ఫంక్షన్‌హాల్ నుంచి పంపించారు. పాడి కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
{{/usCountry}}