జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్లు - నవంబర్ 11న పోలింగ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ్టితో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తుంది. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉండగా… అదే నెల 14వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

Published on: Oct 21, 2025, 09:28:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం రాజీకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో (అక్టోబర్ 21) పూర్తి కానుంది. ఇప్పటివరకు 120కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ చివరి రోజు కావటంతో మరికొందరు కూడా నామినేషన్లు వేయనున్నారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు 2025 (image source https://tsec.gov.in)
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు 2025 (image source https://tsec.gov.in)

నవంబర్ 11న పోలింగ్…

ఇవాళ నామినేషన్ల గడువు పూర్తి అయితే… అక్టోబర్ 22వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 24వ తేదీ దాకా ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11వ తేదీన ఉంటుంది. నవంబర్ 14న కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఇందుకోసం ఈసీ ఏర్పాట్లు సిద్ధం చేసింది.

షేక్‌పేట్ తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తున్నారు. సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు వేయవచ్చు. ఆన్‌లైన్‌లో నామినేషన్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేసినా.. స్వయంగా అభ్యర్థి హాజరు కావాలి. సంతకం, ప్రమాణం కోసం తప్పనిసరిగా వెళ్లాలి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసే సమయంలోపు హాజరు కావాలి.

ఉప ఎన్నికకు గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఖరారయ్యారు. అయితే ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ బై పోల్‌ను మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతానికి ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్​ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్​కు 64,212 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు దక్కాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More