జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి - ప్రకటన విడుదల

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థి పేరు ఖరారైంది. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే మరోసారి బరిలో ఉండనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Published on: Oct 15, 2025 11:38 AM IST
By , Jubilee Hills
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిపై బీజేపీ ప్రకటన చేసింది. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే మరోసారి బరిలో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటన విడుదల చేసింది.

బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి
బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్ రెడ్డి

బీజేపీకి ఈ ఉపఎన్నిక ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి కార్పొరేటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… జూబ్లీహిల్స్ లో జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ లో పాగా వేయాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం ముగ్గురు పేర్లను పరిశీలించిన పార్టీ అధినాయకత్వం… చివరగా లంకల దీపక్​రెడ్డికే అవకాశం దక్కింది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రాధాన్యంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ... ఈ ఎన్నికను సమర్థంగా సమన్వయం చేసేందుకు ఉప ఎన్నిక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. పాబూత్ స్థాయి కార్యకలాపాల వరకు ఎన్నికల వ్యూహాలను సమన్వయం చేసే బాధ్యతలు చూస్తోంది. స్థానిక సమస్యలను సేకరించడం, ప్రచారాన్ని సమర్ధవంతంగా నడిపించడం వంటి బాధ్యతలను ఈ కమిటీ చేపట్టే పనిలో ఉంది.

ఇక జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లు ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్​ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్​కు 64,212 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు దక్కాయి.

మరోవైపు ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేయనుండగా.. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉండనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 22వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీ దాకా ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న ఉంటుంది. 14న కౌంటింగ్ జరిగి ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

News/Telangana/జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి - ప్రకటన విడుదల
News/Telangana/జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి - ప్రకటన విడుదల