జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. ఈరోజు నుంచే నామినేషన్లు స్వీకరణ!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈరోజు నుంచి ఈ నెల 21వ తేదీ దాకా నామినేషన్లను స్వీకరిస్తారు.
జూబ్లీహిల్స్ బై పోల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 22వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీ దాకా ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న ఉంటుంది. 14న కౌంటింగ్ జరిగి ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

షేక్‌పేట్ తహశీల్దార్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మెుత్తం 3.9 లక్షల ఓటర్స్ ఉన్నారు.
సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్లు వేయవచ్చు. ఆన్‌లైన్‌లో నామినేషన్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేసినా.. స్వయంగా అభ్యర్థి హాజరు కావాలి. సంతకం, ప్రమాణం కోసం తప్పనిసరిగా వెళ్లాలి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసే సమయంలోపు హాజరు కావాలి.
ఉప ఎన్నికకు గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని నేడో.. రేపో ప్రకటించే అవకాశం ఉంది. ఈ బై పోల్‌ను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక ప్రచారం కూడా ఊపందుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా జూబ్లీహిల్స్‌లో గెలవాలని, మెజారిటీ 25 వేలుగా టార్గెట్‌గా పెట్టుకున్నారు. మరోవైపు కేటీఆర్ కూడా కారు కావాలా బుల్డోజర్ కావాలా అంటూ ప్రచారం చేస్తున్నారు. దీపావళి తర్వాత ప్రచారం మరింత హీట్ ఎక్కనుంది.
ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న రెండో ఉప ఎన్నిక ఇది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఫిబ్రవరి 24, 2024న ప్రమాదంలో మరణించిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ బైపోల్ వచ్చింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


