...
...
Next Story

KU Distance Admissions 2026 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - కొత్త నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలు

KU Distance Admissions 2026 : కాకతీయ యూనివర్సిటీ (జూలై 2026) డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Aug 9, 2026, 14:06:47 IST
Advertisement

KU Distance Admissions 2026 : వరంగల్ కాకతీయ యూనివర్శిటీ(సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ) దూర విద్యలో ప్రవేశాలకు కొత్త నోటిఫికేషన్ (జూలై సెషన్ - 2026) జారీ అయింది. ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దూరవిద్య ప్రక్రియలో భాగంగా పలు రకాల డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సుల వివరాలు :

  • అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు: బీ.ఏ (B.A.), బి.కామ్ జనరల్ , బి.కామ్ కంప్యూటర్స్ (B.Com Computers), బి.బి.ఏ , బి.ఎస్సీ, బి.ఎల్.ఐ.ఎస్సీ (B.LISc).
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు: ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, రూరల్ డెవలప్‌మెంట్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్).
  • అంతేకాకుండా... ఎం.కామ్ , ఎం.ఎస్.డబ్ల్యూ , హెచ్.ఆర్.ఎమ్ (H.R.M), ఎమ్.ఎల్.ఐ.ఎస్సీ (M.LISc), ఎమ్.ఎస్సీ లో మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జూలాలజీ కోర్సులు ఉన్నాయి. వీటితో పాటు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సును సైతం అందుబాటులో ఉంచారు.
  • డిప్లొమా కోర్సులు : గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్, మేధో సంపత్తి హక్కుల చట్టాలు, కంప్యూటర్ అప్లికేషన్స్, యోగా, ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్, రూరల్ డెవలప్‌మెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్.
  • సర్టిఫికెట్ కోర్సులు : లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, పైథాన్ ద్వారా డేటా సైన్స్, పైథాన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్ ద్వారా మెషిన్ లెర్నింగ్, లైఫ్ & కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్, యోగా, గిరిజన అధ్యయనాలు , శాంతి అధ్యయనాలు (Peace Studies), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బయోఇన్ఫర్మాటిక్స్, హ్యూమన్ వాల్యూస్.
  • ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లు : మిమిక్రీ, సిపిఆర్ (CPR), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్యూటీషియన్, మెహందీ డిజైనింగ్, పేరిణి నృత్యం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • విద్యార్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ www.sdlceku.co.in ద్వారా దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సురేష్ లాల్ తెలిపారు. ఫీజు చెల్లింపులను ఆన్‌లైన్ లేదా క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా పూర్తి చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

  • ప్రవేశాలకు చివరి తేదీ : 15-09-2026
  • అధికారిక వెబ్ సైట్ : https://www.sdlceku.co.in/
  • అదనపు సమాచారం లేదా సందేహాల కోసం విశ్వవిద్యాలయ ఫోన్ నంబర్లు 0870-2461480, 2461490 లేదా ఇమెయిల్ sdlceku@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.

కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు
కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks