Kavitha New Party : కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటన.. ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు!
Kavitha New Party : మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటిస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రానుంది.
మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్‌లో అధ్వయ కన్వెన్షన్ వేదికగా కొత్త రాజకీయ పార్టీని ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత ప్రకటిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కవిత మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. సరిగా ఉదయం 10 గంటలకు పార్టీ పేరును ప్రకటిస్తారు, జెండా ఆవిష్కరిస్తారు. ఉద్యమకారులను పెద్ద సంఖ్యలోఈ సభకు ఆహ్వానించారు.

వరంగల్ కాకతీయ కళా తోరణం ఆకృతిలో ప్రధాన ద్వారం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన ఉంటుంది. అనంతరం పార్టీ జెండావిష్కరణ జరుగుతుంది. సభకు వచ్చే అతిథులకు 34 రకాల తెలంగాణ వంటకాలతో భోజనాలు ఉంటాయి.
కవిత రాజకీయ పార్టీ ప్రారంభోత్సవానికి ముందు, సైబరాబాద్ పోలీసులు మునిరాబాద్ ఏరియాలో రోజంతా భారీ ట్రాఫిక్ రద్దీ ఉంటుందని హెచ్చరిస్తూ ట్రాఫిక్ సలహా జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడటం, వాహన ర్యాలీల కారణంగా ముఖ్యంగా మునీరాబాద్ చుట్టుపక్కల NH-44, అంతర్గత గ్రామ రహదారులపై ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
మునీరాబాద్ గ్రామ రహదారుల్లోకి భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తామని, కండ్లకోయ, ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ లేన్‌ల ద్వారా దారి మళ్లింపులు ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు. పూడూరు గ్రామ వై-జంక్షన్, సీఎంఆర్ కాలేజ్ ఎక్స్ రోడ్ల వంటి కీలక కూడళ్ల వద్ద, వాహనాలను మేడ్చల్, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిస్తారు. సమావేశానికి హాజరయ్యే వాహనాలను మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు.
రద్దీ సమయాల్లో మునీరాబాద్ మార్గాన్ని తప్పించి, మేడ్చల్, కిస్తాపూర్, సమీప ప్రాంతాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులకు పోలీసులు సూచించారు. ప్రజలు సహకరించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


