TG POLYCET Hall Ticket : తెలంగాణ పాలిసెట్ 2026 హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
TG POLYCET Hall Ticket 2026 : తెలంగాణ పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు రిజిస్ట్రేషన్ లేదా మొబైల్ నెంబర్ వివరాలతో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TG POLYCET Hall Ticket 2026 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘పాలిసెట్-2026’కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఎంట్రెన్స్ పరీక్షను మే 13వ తేదీన నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఏమైనా సందేహాలు ఉంటే 08031404549 ఫోన్ నెంబర్ లేదా te@telangana.gov.in, మెయిల్ ను సంప్రదింవచ్చు.
టీజీ పాలిసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (60), ఫిజిక్స్ (30), కెమిస్ట్రీ (30) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుంది. 10వ తరగతి (SSC) సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి మరియు నెగిటివ్ మార్కులు ఉండవు.
టీజీ పాలిసెట్ హాల్ టికెట్ - డౌన్లోడ్ ఇలా:
- విద్యార్థులు https://www.polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో కనిపించే 'Hall Ticket' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట ఉంచుకోవాలి. పరీక్షా సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్‌పై ఉన్న ఫోటో స్పష్టంగా లేకపోతే, గెజిటెడ్ అధికారితో ధృువీకరించిన ఫోటోను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

