TGSRTC DA hike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు - డీఏ పెంపు, జనవరి నెల నుంచే వర్తింపు!

TGSRTC Employees DA hike : ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2.1 శాతం డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరాలను వెల్లడించారు.

Published on: Apr 10, 2026 11:27 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

TGSRTC Employees DA hike : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి (2026) నుంచి 2.1 శాతం డీఏను పెంచనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఇంతకు ముందు 50.7 శాతం డీఏ ఉండగా… తాజా పెంపుతో ఇది 52.8 శాతం చేరుతుంది.

ఆర్టీసీ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
ఆర్టీసీ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష

గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా డీఏను చెల్లించనుంది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. చివరగా జూలై 2025 లో 2.1 శాతం డీఏ పెంచారు. డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

జనవరి నుంచే అమలు - రవాణాశాఖ మంత్రి పొన్నం

ఆర్టీసీలో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డీఏ ను ప్రభుత్వం విడుదల చేసిందని ప్రకటించారు.

“జనవరి 2026 నుంచే 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వస్తుంది. దీంతో సవరించిన డీఏ వల్ల 52.8 శాతానికి చేరింది. జనవరి నుంచి ఇవ్వాల్సిన పెండింగ్ డీఏ లు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుంది. ప్రజా ప్రభుత్వం మొదటి నుంచి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుంది” అని మంత్రి పొన్నం చెప్పారు.

పెండింగ్ లో ఉన్న డీఏ 2.1 శాతం పెంచడం వల్ల గతంలో ఉన్న 50.7 శాతం నుండి 52.8 శాతానికి పెరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగికీ ఇది ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ లో లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లెలా కృషి చేస్తామని ప్రకటించారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న డీఏ ను ప్రకటించడం సంతోషకరమని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయని చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More