...
...
Next Story

మేడారం మహాజాతర ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి.. వనదేవతల దర్శనానికి ప్లాన్ చేసుకోండి!

మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ఇప్పటికే చాలా మంది వెళ్తున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు జనాలు తరలివస్తున్నారు. ఈ ఏడాది సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు సంబంధించి ముఖ్యమైన తేదీలు తెలుసుకోండి.

Published on: Jan 13, 2026, 11:36:26 IST
Advertisement

మేడారం మహాజాతర 2026 కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వనదేవతలకు మెుక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతరకు ముందే మేడారం కిక్కిరిసిపోతోంది. మేడారం జాతర గురించి ముఖ్యమైన తేదీలు తెలుసుకుంటే.. దానికి తగ్గట్టుగా ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు. 2026లో మేడారం మహాజాతర జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది.

మహాజాతర ముఖ్యమైన తేదీలు

  • జనవరి 14 - గుడిమేలిగే పండుగ
  • జనవరి 21 - మండమెలిగే పండుగ
  • జనవరి 27 - మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారానికి పయనం. ఇదే రోజు తాడ్వాయి మండలంలో కన్నెపల్లి నుంచి జంపన్న బయలుదేరి మేడారం గద్దెకు చేరుకుంటారు
  • జనవరి 28 - కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత, ఏటూరునాగారం మండలంలో గల కొండాయి నుంచి గోవిందరాజులు, మహబూబాబాద్ జిల్లా నుంచి బయలుదేరిన పగిడిద్దరాజులు గద్దెకు చేరుకుంటారు
  • జనవరి 29 - వనదేవత సమ్మక్క చిలుకలగుట్ట నుంచి బయలుదేరి గద్దెపైకి చేరుకుంటారు
  • జనవరి 30 - భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లిస్తారు
  • జనవరి 31 - దేవతల వన ప్రవేశం
  • ఫిబ్రవరి 4 - తిరుగువారం పండుగ, మహా జాతర ఉత్సవాల ముగింపు ఉంటుంది.

మేడారంలో కేబినెట్ భేటీ

మేడారం జాతర తేదీలు
మేడారం జాతర తేదీలు

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. ఈసారి భిన్నంగా మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టుగా సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పలు కార్యక్రమాల్లో హాజరు అవుతారు. సాయంత్రం మంత్రులతో కలిసి మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత కేబినెట్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రోజున అంటే జనవరి 19వ తేదీన ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత.. హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి తిరుగుపయనం అవుతారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe