జనవరి 19న మేడారం ఆధునీకరణ పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనవరి 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులను ప్రారంభిస్తారని వెల్లడించారు.
మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయంలో రూ. 300 కోట్ల వ్యయంతో చేపట్టిన పునరుద్ధరణ పనులను జనవరి 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హనుమకొండలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అయిన శ్రీనివాస్ రెడ్డి.. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల స్థితిపై సమీక్షించారు. మేడారంలో దాదాపు 200 సంవత్సరాల పాటు మన్నికగా ఉండేలా రాతి కట్టడాల వంటి శాశ్వత పనులను చేపట్టామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మేడారంలో రహదారుల విస్తరణ, యాత్రికుల సౌకర్యాల మెరుగుదల వంటి ఇతర అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, జనవరి 28 నుండి 31 వరకు జరిగే సమ్మక్క-సారక్క మహా జాతర కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
వరంగల్‌లోని వరద ముంపునకు గురయ్యే ప్రధాన పట్టణ ప్రాంతాల్లో నీటి కాలువల నిర్మాణం సహా పలు అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రూ. 4,000 కోట్లు మంజూరు చేశారని మంత్రి పొంగులేటి తెలిపారు. రూ. 570 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని, నగరంలో తాగునీటి సరఫరాను పెంచడానికి కూడా టెండర్లు పిలుస్తామని వెల్లడించారు.
ఇప్పటికే మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్‌కే ఇళ్లతో పాటు, దిగువ మధ్యతరగతి వర్గాల కోసం వరంగల్‌లో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.
భద్రకాళి ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూడా అధికారులకు మంత్రి సూచించారు. రూ. 1,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 24 అంతస్తుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని, ఈ సదుపాయాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని చెప్పారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ త్వరలో పూర్తి చేసేలా ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
గిరిజనులు, గిరిజనేతరుల ఆరాధ్య దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క ఈ సందర్భంగా చెప్పారు. అందరినీ జాతరకు ఆహ్వాస్తున్నామన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


