...
...
Next Story

సోమశిల టు శ్రీశైలం : కృష్ణమ్మ అలలపై లాంచీ యాత్ర - టూర్ ప్యాకేజీ వివరాలివే

కృష్ణా నది అందాలను ఆస్వాదించే సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 9కి లాంచీ బయలుదేరుతుంది. మల్లన్న దర్శనం తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Nov 9, 2025, 10:54:49 IST
Advertisement

టూరిస్టులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పేసింది. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం షురూ అయింది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ టూరిజం లాంచీని ప్రారంభించగా 65 మంది ప్రయాణికులు శ్రీశైలంకు ప్రయాణించారు. పర్యాటక శాఖ అధికారులు జెండా ఊపి లాంచీని ప్రారంభించారు.

వారానికి 3 సార్లు…

సోమశిల టు శ్రీశైలం
సోమశిల టు శ్రీశైలం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ తీరంలోని సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ జర్నీ ఉంటుంది. వారానికి మూడు సార్లు ఈ ఆపరేషన్ ఉంటుంది. మంగళవారం, గురువారం, శనివారాల్లో ఉదయం 9 గంటలకు లాంచీ సోమశిల నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

కృష్ణమ్మ ఒడిలో, న‌‌‌‌‌‌‌‌ల్లమ‌‌‌‌‌‌‌‌ల ప‌‌‌‌‌‌‌‌చ్చద‌‌‌‌‌‌‌‌నం అందాలను వీక్షిస్తూ కృష్ణా అలలపై జర్నీ కొనసాగుతుంది. ఈ అద్భుతమైన జర్నీ… కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేట్ చేయరు. కృష్ణా నదిలో సాగే జర్నీ… మాటల్లో వర్ణించలేం.సుమారు 120 కిలోమీటర్ల జలవిహారం ఉంటుంది. 6 నుంచి 7 గంటల పాటు సమయం పడుతుంది.

టికెట్ ధరలు….

ఒకవైపు ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1600 వసూలు చేస్తున్నారు. లాంచీలో పర్యాటకులకు ఉదయం మరియు సాయంత్రం టీ, స్నాక్స్ మరియు లంచ్ అందిస్తారు.

వన్ వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలతో పోల్చితే… రౌండప్ (రానుపోను) జర్నీకి ధరలు వేరుగా ఉంటాయి. ఈ వివరాలను కూడా తెలంగాణ టూరిజం వెబ్ సైట్ ( https://tgtdc.in/home ) లో చూడొచ్చు. లేదా స్థానికంగా ఉండే టూరిజం కార్యాలయంలో వివరాలను తెలుసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe