Telangana Weather : తెలంగాణకు రెయిన్ అలర్ట్ - రాబోయే 5 రోజులు తేలికపాటి వర్షాలు, బలమైన ఈదురుగాలులు
తెలంగాణలో రాబోయే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

వర్ష సూచనతో పాటు ఈదురుగాలులు…
- జూలై 12 నుంచి జూలై 13 ఉదయం వరకు: రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలుంటాయి. అన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది.
- జూలై 13 నుండి జూలై 14 ఉదయం వరకు: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా బలమైన గాలుల తీవ్రత కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
- జూలై 14 నుండి జూలై 15 ఉదయం వరకు: వాతావరణ సూచనల ప్రకారం…. రాష్ట్రంలో వర్ష సూచనతో పాటు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది.
- జూలై 15 నుండి జూలై 16 ఉదయం వరకు: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బలమైన ఉపరితల గాలుల తీవ్రత ఉంటుంది. అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుసే సూచనలున్నాయి.
- జూలై 16 నుండి జూలై 17 ఉదయం వరకు: వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపించనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే… ఈ రోజుకు ఎలాంటి బలమైన గాలుల హెచ్చరికలు లేవని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రయాణం ఒడిదొడుకులతోనే సాగుతోంది! జూన్ నెల ముగిసే సమయానికి దేశంలో దాదాపు 40 శాతం వర్షపాత లోటు నమోదైంది. ఇటీవలి కాలంలో ఇంత బలహీనమైన ప్రారంభం ఎప్పుడూ లేదు. జూన్ చివరి వారంలో….. జులై మొదటి వారంలో పడిన భారీ వర్షాల వల్ల ఈ లోటు 14 శాతానికి తగ్గింది. జులై 9 నాటికి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. అయినప్పటికీ వర్షపాతం ఏకరీతిగా లేదు. పశ్చిమ, తూర్పు భారత ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిసినా, మధ్య భారత రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ తీవ్ర వర్షపాత లోటు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రైతులు విత్తనాలు వేసేందుకు సరైన వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

