...
...
Next Story

తెలంగాణలో డిలీట్ అయిన ఓటర్ల లిస్ట్ విడుదల.. మీ పేరు ఎలా చెక్ చేయాలి?

తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓటర్ల జాబితాను తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం అన్ని జిల్లాల్లోనూ హైదరాబాద్‌లోనే అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగింపు జరిగినట్లు తెలుస్తోంది.

Published on: Aug 24, 2026, 15:53:29 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా నుండి 73,39,235 ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన మొత్తం ఓట్లలో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 19,41,444 ఓట్లు డిలీట్ అయ్యాయి.

ఓటర్ల తొలగింపు
ఓటర్ల తొలగింపు

జూన్ 10, 2026 నాటికి తెలంగాణలో 3,38,26,448 ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితాలో ఆ సంఖ్య 2,64,87,213 కి తగ్గింది. అంటే మొత్తం ఓటర్ల జాబితాలో 21.70 శాతం తగ్గుదల నమోదైంది. ఓట్ల తొలగింపునకు ప్రధాన కారణాలు ఉన్నాయి.

శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లినవారు 45,18,963, అడ్రస్ లేనివారు / కనిపించకుండా పోయినవారు 11,25,546, మరణించిన ఓటర్లు 9,22,229, ఇతర నియోజకవర్గాల్లో నమోదు 6,70,203, ఇతర కారణాలతో 1,02,294 మందివి తొలగించారు.

అత్యధికంగా హైదరాబాద్‌లో 19,41,444 ఓట్లు తొలగించారు. రంగారెడ్డి రెండో స్థానంలో 12,87,091 ఓట్లు డిలీట్ అయ్యాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 10,71,566 ఓట్లు తొలగించారు. యాదాద్రి-భువనగిరిలో అత్యల్పంగా కేవలం 26,121 ఓట్లు మాత్రమే తొలగించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 1,79,510 ఓట్లు తొలగించగా, యాకుత్‌పురాలో 1,54,982 ఓట్లు తొలగించారు. అత్యల్పంగా ఛార్మినార్ నియోజకవర్గంలో 94,174 ఓట్లు డిలీట్ అయ్యాయి. శాతాల వారీగా చూస్తే ముషీరాబాద్‌లో అత్యధికంగా 45.17 శాతం, మలక్‌పేటలో 44.76 శాతం ఓట్లు తొలగిపోగా, బహదూర్‌పురాలో అత్యల్పంగా 34.57 శాతం తొలగింపు నమోదైంది.

జిల్లాల వారీగా డిలీట్ అయిన ఓట్లు?

తొలగించిన ఓటర్ల వివరాల జాబితాను తెలంగాణ సీఈఓ (CEO) అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ప్రస్తుతం అభ్యంతరాలు, క్లెయిమ్‌ల (Claims and objections) సమయం నడుస్తున్నందున, పొరపాటున ఓటు కోల్పోయిన అర్హులైన పౌరులు 'ఫారమ్ 6' (FORM 6) సమర్పించి తమ ఓటును తిరిగి నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ లింక్ క్లిక్ చేసి డిలీట్ అయిన వారి వివరాలు చూసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe