Tirupati Flights : హైదరాబాద్‌ టు తిరుపతి.... కొత్తగా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసులు, షెడ్యూల్ ఇలా

Hyderabad to Tirupati Flights : విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతితో పాటు ఆరు నగరాలకు సెప్టెంబరు 1 నుంచి కొత్తగా నాన్‌స్టాప్ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. 

Published on: Aug 7, 2026, 17:44:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Air India Express Hyderabad to Tirupati Flights : దేశీయ విమాన ప్రయాణికులకు ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. తిరుపతితో సహా దేశంలోని ఆరు కీలక నగరాలకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో విమాన అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు
  1. తిరుపతి
  2. ఔరంగాబాద్
  3. కోయంబత్తూర్
  4. జామ్‌నగర్
  5. జోధ్‌పూర్
  6. మదురై

ఈ ఆరు నగరాలను దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నైలతో నేరుగా అనుసంధానించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో…. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లే భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి తిరుపతికి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, వయోవృద్ధులు అత్యంత వేగంగా, సుఖవంతంగా ఆధ్యాత్మిక క్షేత్రానికి చేరుకోవచ్చని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు వెల్లడించారు.

కేవలం ఆధ్యాత్మిక యాత్రికులకే కాకుండా, ఈ నూతన సర్వీసులు వ్యాపార, పర్యాటక రంగాలకు కూడా కొత్త ఊపిరి పోయనున్నాయి. ఔరంగాబాద్, జోధ్‌పూర్, మదురై, కోయంబత్తూర్ వంటి చారిత్రక, పారిశ్రామిక నగరాలకు మెట్రో నగరాల నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ లభించడం వల్ల ప్రయాణికుల రద్దీ పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. సెప్టెంబరు 1 నుంచి ఈ విమానాల టికెట్ బుకింగ్‌లు, సర్వీసుల వేళలు పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి.

టైమింగ్స్ ఇలా…..

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం…. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి ప్రతీరోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు విమానం బయలుదేరుతుంది. ఈ విమానం కేవలం గంట పది నిమిషాల వ్యవధిలోనే…. అంటే మధ్యాహ్నం 2.40 గంటలకల్లా తిరుపతి చేరుకుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, వ్యాపార ప్రయాణికులకు ఈ నాన్‌స్టాప్ సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.

అలాగే హైదరాబాద్ - చెన్నై మార్గంలో కూడా రోజువారీ ఉదయం సర్వీసును అందుబాటులోకి తెస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ ఉదయం 8.05 గంటలకు విమానం బయలుదేరి… ఉదయం 9.40 గంటలకు చెన్నై గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఉదయమే చెన్నై చేరుకునే వెసులుబాటు ఉండటంతో ఐటీ, వ్యాపార రంగానికి చెందిన ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More