తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు సీపీ సజ్జనార్ సూచనలు!
IMD Weather Update : తెలంగాణలో వర్షాలు కురవనున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపరితల వాతావరణంలో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల తీవ్ర ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. అక్కడికక్కడ ఈదురుగాలులతో కూడిన వానలు పడుతుండటంతో వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ, పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 24 నుండి 48 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తరహా మేఘాల కలయిక వల్ల ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షం పడనుంది.
గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాజధాని హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ వర్షాలకు కారణమైన క్యుములోనింబస్ మేఘాలు చాలా నిలువుగా, భారీ ఎత్తులో రూపుదిద్దుకుంటాయి. వీటిని సాధారణంగా తుఫాను మేఘాలు అని పిలుస్తారు. ఇవి నేల మట్టానికి దగ్గరగా మొదలై వేల అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ మేఘాల వల్ల హఠాత్తుగా కుండపోత వర్షం పడటం, వర్షంతో పాటు తీవ్రమైన ఉరుములు, మెరుపులు, గాలులు వీచే అవకాశం ఉంటుంది.
వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో పెద్ద చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదు. ఆరుబయట ఉండే కరెంట్ వైర్లు, విరిగిపడిన విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.
సజ్జనార్ విజ్ఞప్తి
హైదరాబాద్ ప్రజలకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. నగరంలో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దన్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దని, బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్నారు.
'ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి.' అని సజ్జనార్ అన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


