SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు అప్డేట్ - వరంగల్, విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు, షెడ్యూల్ వివరాలు

South Central Railway Special Trains : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్‌రాజ్-తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ ట్రైన్స్ వరంగల్, విజయవాడ మీదుగా వెళ్తాయి. 

Published on: Jul 31, 2026, 06:02:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

South Central Railway Special Trains : పండుగలు, సెలవుల వేళ రైళ్లలో పెరిగే ప్రయాణికుల రద్దీని అదుపు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాగ్‌రాజ్, తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా వరంగల్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లు

షెడ్యూల్ వివరాలు :

  • రైలు నంబర్ 04171 (ప్రయాగ్‌రాజ్ - తిరునెల్వేలి) : ఈ రైలు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. 01.08.2026 నుంచి 22.08.2026 వరకు మొత్తం 4 సర్వీసులను నడపనున్నారు.
  • రైలు నంబర్ 04172 (తిరునెల్వేలి - ప్రయాగ్‌రాజ్) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి సోమవారం నడుస్తుంది. 03.08.2026 నుంచి 24.08.2026 మధ్య మొత్తం 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

హాల్ట్ స్టేషన్లు…

ఈ రెండు ప్రత్యేక రైళ్లు ఇరువైపులా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లోని అనేక ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. మాణిక్‌పూర్, సత్నా, కట్ని, జబల్‌పూర్, ఇటార్సి, నాగ్‌పూర్, చంద్రపూర్, బలార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నామక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, శాతూర్, కోవిల్‌పట్టి స్టేషన్లలో ఆగుతాయి.

ప్రయాణికులందరికీ అనుకూలంగా ఉండేలా ఈ ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. సొంత ఊళ్లకు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుగానే రిజర్వేషన్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More