TTD : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ
తిరుమలలో ఎంతగానో ఎదురుచూసే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లూ చేస్తోంది.
తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయి. సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు
15/09/2026 – సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.
16/09/2026 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
17/09/2026 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,
18/09/2026 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,
19/09/2026 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం
20/09/2026 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం.
21/09/2026 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,
22/09/2026 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,
23/09/2026 ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా తిరుమల, తిరుపతికి అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని జేఈవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
భక్తుల వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లో తగిన పార్కింగ్ స్థలాలు సిద్ధం చేయాలని, వివిధ ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించాలని సూచించారు. పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల వద్ద తగిన సంఖ్యలో మొబైల్ మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు కల్పించి పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు, భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ముఖ్య ప్రాంతాల్లో క్యూ ఆర్ కోడ్‌లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
స్థానిక ఆలయాలు, ప్రధాన భవనాలు, ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి బస్టాండ్, అలిపిరి నడక మార్గం, విష్ణునివాసం, శ్రీనివాసం తదితర ప్రాంతాల్లో అదనపు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య ప్రాజెక్టులో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని జేఈవో తెలిపారు. భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో శ్రీవారి సేవకులను నియమించి సేవలను మరింత విస్తృతంగా అందించాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి. రవిని ఆదేశించారు.
శ్రీవారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల్లో అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ శాఖతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి భక్తులకు అత్యుత్తమ సేవలు అందించాలని జేఈవో సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


