LPG Gas eKYC : ఎల్పీజీ గ్యాస్ ఈకేవైసీ గడువు పెంపు.. తర్వాత కనెక్షన్ కట్ చేస్తారా?

LPG Gas eKYC : ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి కాస్త ఊరట లభించే న్యూస్. గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ గడువును చమురు కంపెనీలు పొడిగించాయి.

Published on: Aug 25, 2026, 15:15:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎల్పీజీ కనెక్షన్ల కోసం e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి ఆగస్టు 23న ఉన్న గడువును ఆగస్టు 31 వరకు పొడిగించడంతో, వినియోగదారులకు కొంత ఊరట లభించింది. గృహ వినియోగదారులకు e-KYC లేదా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ చాలా కీలకం. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గృహ వినియోగ ధరకే ఎల్పీజీ రీఫిల్స్‌ను పొందడం కొనసాగించడానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇటీవల వినియోగదారులను కోరుతున్నాయి.

ఎల్పీజీ గ్యాస్ ఈకేవైసీ
ఎల్పీజీ గ్యాస్ ఈకేవైసీ

కొత్తగా గడువును ఆగస్టు 31 వరకు పెంచినట్టుగా తెలుస్తోంది. e-KYC పూర్తి చేయని వారికి దీనికి సంబంధించిన సందేశం అందుతుందని అధికారులు అంటున్నారు. గణాంకాల ప్రకారం దేశంలో ఉన్న 32.97 కోట్ల మంది క్రియాశీల గృహ ఎల్పీజీ వినియోగదారులలో 1.26 కోట్ల మంది తెలంగాణలో ఉన్నారు. రాష్ట్రంలోని వినియోగదారులలో సుమారు 82 శాతం మంది ఇప్పటికే e-KYC పూర్తి చేశారు. గడువు పొడిగింపుతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

గడువు తేదీకి ముందు తెలంగాణలోని అనేక ప్రాంతాలలో వంట గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల రద్దీని ఎదుర్కొన్నాయి. వినియోగదారులు సంబంధిత కంపెనీ యాప్‌ల ద్వారా కూడా e-KYC పూర్తి చేసుకునే అవకాశం ఉంది. తమ ఆధార్ నంబర్లు ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్‌లతో అనుసంధానించిన చాలా మంది ఈ పద్ధతినే ఎంచుకున్నారు.

ఆగస్టు 31 గడువు వరకు ఈకేవైసీ నిబంధనలను పాటించని వారికి ఏ ధరలో రీఫిల్స్ సరఫరా చేస్తారనేది పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాలపై ఆధారపడి ఉండనుంది. దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆగస్టు 31 వరకు గడువు పొడిగింపు విషయాన్ని ఓఎంసీ అధికారులు మౌఖికంగా తెలియజేశారు. దీంతో చాలా ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేసుకుంటున్నారు.

అయితే ఈకేవైసీ పూర్తి చేయకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని రకరకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఈకేవైసీ పూర్తి చేయకుంటే.. దాని ప్రభావం ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ మీద పడనుంది. బుకింగ్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ కేవైసీ పూర్తి చేసినవారికి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే మీకు ప్రాధాన్యత ఉంటుంది. గ్యాస్ కనెక్షన్స్ రద్దు చేయరు. కానీ సేవల్లో అంతరాయం కలిగే అవకాశం మాత్రం ఉంటుంది. కేవైసీ లేని కనెక్షన్లను నిలిపివేస్తామని, చమురు కంపెనీల నుంచి ఎలాంటి సమాచారం లేదు.

ఎల్పీజీ ఈకేవైసీ గడువు మెుదట ఆగస్టు 16గా నిర్ణయించారు. సర్వర్ పనిచేయకపోవడం, అనేక ఇతర సాంకేతిక సమస్యలతో దానిని పెంచారు. తర్వాత ఆగస్టు 23వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆగస్టు 31 వరకు పొడిగించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More