Fire Accident : అపార్ట్మెంట్లో ఎగసిపడిన మంటలు.. భయంతో పరుగులు తీసిన జనాలు
Fire Accident : రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని హైరైజ్ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భయానికి గురైన స్థానికులు వెంటనే పరుగులు తీశారు.
హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని నానక్‌రామ్‌గూడ (పుప్పాలగూడ ప్రాంతం)లో ఉన్న ప్రముఖ నివాస సముదాయం పసిఫికా హిల్‌క్రెస్ట్ హైరైజ్ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
{{^htLoading}} {{/htLoading}}
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ 22 అంతస్తుల భవనంలోని ఒక బ్లాక్‌లో ఐదో అంతస్తు నుండి మంటలు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే మంటలు, దట్టమైన పొగ భవనంలోని పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. దీంతో అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భవనం నుండి బయటకు పరుగులు తీశారు.
{{^htLoading}}
Advertisement
{{/htLoading}}
ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ప్రతి ఫేజ్‌లో సుమారు ఐదు బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్కో బ్లాక్ మధ్య సరైన రూట్ సెట్బ్యాక్లు ఉండటంతో సహాయక చర్యలకు కొంత వెసులుబాటు కలిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే గచ్చిబౌలి నుండి ఫైర్ ఇంజిన్లు, అత్యవసర విపత్తు నిర్వహణ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎత్తైన అంతస్తులకు మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండటంతో, ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. అలాగే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేదా, ఆస్తి నష్టం ఏ మేరకు జరిగింది అనే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.