హైదరాబాద్ నగరం అడ్డాగా సాగుతున్న మరో దారుణమైన అక్రమ దందా బట్టబయలైంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని అమాయక మహిళల నుంచి అక్రమంగా అండాలను (ఊసైట్) సేకరించి విక్రయిస్తున్న ఒక భారీ రాకెట్‌ను మల్కాజ్‌గిరి పోలీసులు ఛేదించారు. మల్కాజ్‌గిరి, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు ఒకేసారి నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ అక్రమ దందా గుట్టురట్టయింది.
8 మంది అరెస్ట్…..

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ దాడుల్లో అక్రమ అండాల విక్రయాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, ఈ దందాలో చిక్కుకున్న 43 మంది బాధితులైన మహిళలను రక్షించారు.
ఈ ముఠా ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల మహిళలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఎరగా వేసి అండ దానం (ఎగ్ డొనేషన్) ప్రక్రియల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌కు రప్పించేవారు. ఇక్కడ పలు దవాఖానలు, కేంద్రాల ద్వారా ఎటువంటి చట్టబద్ధమైన నియమ నిబంధనలు పాటించకుండా, ఆరోగ్య ముప్పులను సైతం పక్కనపెట్టి వారి నుంచి అక్రమంగా అండాలను సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మల్కాజ్‌గిరి సీపీ సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సమగ్ర ఆపరేషన్ జరిగింది. బేగంపేట్, సరోర్‌నగర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) బలగాలు సంయుక్తంగా ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పక్కా సమాచారంతో నాలుగు స్థావరాలపై ఒక్కసారిగా నిందితులను రౌండప్ చేశారు. ఈ అక్రమ దందా వెనుక ఇంకా ఏయే ఆసుపత్రులు, మధ్యవర్తులు లేదా ఏజెంట్లు ఉన్నారనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఈ కేసుపై మల్కాజ్ గిరి సీపీ సుమతి మాట్లాడుతూ…. అక్రమంగా అండాల సేకరణ, విక్రయాల దందాను గుట్టురట్టు చేశామన్నారు. ఈ దందాలో ఇందౌర్ వాసి అమిత్‌శర్మ ప్రధాన నిందితుడిగా గుర్తించామని పేర్కొన్నారు. ఎక్కువగా బెంగాల్లో పేద మహిళలను గుర్తించి రిక్రూట్ చేసుకున్నారన్నారు. ప్రకాశ్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లో సోదాలు చేశామని… వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళలను గుర్తించి కాపాడామన్నారు.
{{/usCountry}}ఈ కేసుపై మల్కాజ్ గిరి సీపీ సుమతి మాట్లాడుతూ…. అక్రమంగా అండాల సేకరణ, విక్రయాల దందాను గుట్టురట్టు చేశామన్నారు. ఈ దందాలో ఇందౌర్ వాసి అమిత్‌శర్మ ప్రధాన నిందితుడిగా గుర్తించామని పేర్కొన్నారు. ఎక్కువగా బెంగాల్లో పేద మహిళలను గుర్తించి రిక్రూట్ చేసుకున్నారన్నారు. ప్రకాశ్‌నగర్, బేగంపేట, ఎర్రగడ్డ, సరూర్‌నగర్, గోపాలపురం ప్రాంతాల్లో సోదాలు చేశామని… వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళలను గుర్తించి కాపాడామన్నారు.
{{/usCountry}}నిందితులు మధ్యవర్తుల ద్వారా ఐవీఎఫ్ సెంటర్లను సంప్రదించారని… అండాల సేకరణ ప్రక్రియకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తామని మహిళలకు ఆశ చూపారని సీపీ తెలిపారు. మహిళలకు హార్మోన్ ఇంజెక్షన్లు, మెడిసిన్ ఇచ్చినట్లు విచారణలో తేలిందని వివరించారు.మహిళల ఆధార్ కార్డులు, అఫిడవిట్లు సహా పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నామని….అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నామని చెప్పారు.