మహాత్మా గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలో అక్టోబర్ 2న అన్ని రకాల జంతు వధశాలలు (స్లాటర్‌హౌస్‌లు), మాంసం, బీఫ్ విక్రయ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గాంధీజీ అహింసా సిద్ధాంతాలు, ఆయన విశిష్టతను గౌరవిస్తూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ బుధవారం ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చట్టం, 1955లోని సెక్షన్ 533(బి) కింద ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలతో పాటు నగరవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులు అక్టోబర్ 2న పూర్తిగా మూతపడనున్నాయి.
హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పోలీస్ యంత్రాంగాన్ని కోరారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు లేఖలు రాస్తూ, పశువధ శాలలు, మాంసం దుకాణాలు తెరిచి ఉంచకుండా చర్యలు తీసుకోవడానికి మున్సిపల్ అధికారులకు అవసరమైన పోలీసు బందోబస్తు, సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదేశాలను ఉల్లంఘించి అక్టోబర్ 2న ఎవరైనా అక్రమంగా మాంసం విక్రయించినా లేదా జంతు వధకు పాల్పడినా వారిపై జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. నగర ప్రజలు, వ్యాపారులు ఈ నిబంధనలకు సహకరించి, గాంధీ జయంతి వేళ జీహెచ్‌ఎంసీ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు.
డ్రైడే
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా డ్రై డే అమలులో ఉంటుంది. గాంధీజీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఈ రోజున మద్యం అమ్మకాలను నిషేధిస్తారు. అక్టోబర్ 2వ తేదీ వేకువజామున నుంచి అర్ధరాత్రి వరకు వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు పూర్తిగా మూతపడతాయి. వైన్ షాపులతో పాటుగా రెస్టారెంట్ బార్లు, పబ్లు, స్టార్ హోటళ్లు, డిస్ట్రిబ్యూటర్ సెంటర్లలో కూడా మద్యం విక్రయాలు నిలిపివేస్తారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా లేదా నిల్వ చేసినా వారిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తారు.
{{/usCountry}}మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా డ్రై డే అమలులో ఉంటుంది. గాంధీజీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఈ రోజున మద్యం అమ్మకాలను నిషేధిస్తారు. అక్టోబర్ 2వ తేదీ వేకువజామున నుంచి అర్ధరాత్రి వరకు వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు పూర్తిగా మూతపడతాయి. వైన్ షాపులతో పాటుగా రెస్టారెంట్ బార్లు, పబ్లు, స్టార్ హోటళ్లు, డిస్ట్రిబ్యూటర్ సెంటర్లలో కూడా మద్యం విక్రయాలు నిలిపివేస్తారు. ఎక్సైజ్ శాఖ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయించినా లేదా నిల్వ చేసినా వారిపై ఎక్సైజ్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, లైసెన్సులు రద్దు చేస్తారు.
{{/usCountry}}