ప్రతీ పోలీస్ స్టేషన్‌లో రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్.. కొత్తగా TG-TMARS
TG-TMARS : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్, రోడ్డు సేఫ్టీపై ప్రత్యేక దృష్టిసారించారు. తన పరిధిలోనే ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రతీ పోలీస్ స్టేషన్‌లో రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్ ఉండనున్నారు.
రాష్ట్రంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు విధించడం, వసూలు చేయడమే కాకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, అత్యవసర వైద్య సాయం అందించడమే లక్ష్యంగా 'తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో' (TG-TMARS)ను ఏర్పాటు చేశారు.

రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి పరిధిలో ఈ కొత్త వ్యవస్థ ముఖ్యమంత్రి పరిధిలో పనిచేస్తుంది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 135) జారీచేసింది. ఈ ప్రత్యేక విభాగం అదనపు డీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది.
రాష్ట్రంలోని 32 వేల కిలోమీటర్లకు పైగా ఉన్న రహదారులు, 1.8 కోట్లకు పైగా ఉన్న వాహనాల రాకపోకలను ఈ బ్యూరో పర్యవేక్షిస్తుంది. రోడ్డు రవాణాతో పాటు మెట్రో, రైల్వే భద్రతను కూడా ఈ విభాగానికే అప్పగించారు.
బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతీ పోలీస్ స్టేషన్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఒక 'రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్'ను నియమిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను 'గోల్డెన్ అవర్'లో ఆసుపత్రికి తరలించడం వీరి బాధ్యత.
అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్న హైవేలపై స్పీడ్ డిటెక్టర్లు, అత్యాధునిక కెమెరాలతో కూడిన 'హైవే పెట్రోలింగ్ యూనిట్లు' ఏర్పాటు చేసి నిరంతరం పహారా ఇస్తారు. ఈ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రత్యేకంగా 'ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్'ను ఏర్పాటు చేశారు.
పోలీసులకు వచ్చే ట్రాఫిక్ జరిమానాల్లో 40 శాతం మొత్తాన్ని నేరుగా ఈ నిధికే మళ్లిస్తారు. ఈ నిధులను సిబ్బంది శిక్షణ, అధునాతన సాంకేతికత, పెట్రోలింగ్ వాహనాలు, రహదారుల అత్యవసర మరమ్మతుల కోసం ఉపయోగిస్తారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


